ఉమ్మడి జిల్లా ప్రజలకు, కార్యకర్తలకు వినాయక చవితి శుభాకాంక్షలు మంత్రి దామోదర్ రాజనర్సింహ
ఉమ్మడి జిల్లా ప్రజలకు, కార్యకర్తలకు వినాయక చవితి శుభాకాంక్షలు
విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలి: మంత్రి దామోదర రాజనర్సింహ.
సంగారెడ్డి ; ఉమ్మడి జిల్లా ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు, అందోల్ నియోజకవర్గం ప్రజలకు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.
వినాయక చవితి పర్వదినాన్ని ప్రజలంతా భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి కృపతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి, సమృద్ధి నెలకొనాలని కోరారు.
వినాయకుడి ఆశీస్సులతో ప్రజల జీవితాల్లో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోయి, ప్రతి ఒక్కరూ అభివృద్ధి, సంతోషాలతో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. పండుగ సందర్భంగా ప్రజలంతా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ మట్టి వినాయక ప్రతిమలను ఉపయోగించాలని మంత్రి సూచించారు.అదేవిధంగా ఉమ్మడి జిల్లా ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు పరస్పరం సోదరభావంతో వినాయక చవితి వేడుకలను ఘనంగా జరుపుకోవాలని మంత్రి దామోదర రాజనర్సింహ పిలుపునిచ్చారు.