విఘ్నాలను తొలగించి.. విజయాలను అందించే విఘ్నేశ్వరుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ, పవిత్రమైన "వినాయక చవితి" సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆదిదేవుడైన గణనాథుని కరుణాకటాక్షాలతో ప్రతి ఇంటా సుఖశాంతులు, ఆనందం, ఐశ్వర్యం వెల్లివిరియాలని, ప్రతి కుటుంబం ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని ముఖ్యమంత్రి గారు ఆకాంక్షించారు. సమాజంలో సౌభ్రాతృత్వం, సద్భావన, మానవతా విలువలు మరింత పరిఢవిల్లాలని కోరుకున్నారు.
సకల సంకల్పాలకు విఘ్నాలు తొలగించి, మన అడుగులకు విజయబాటలు వేయాలని.. జ్ఞానాన్ని, ధైర్యాన్ని, సత్ప్రవర్తనను ప్రసాదించాలని ఆదిపూజ్యుడైన ఆ విఘ్నేశ్వరుడిని ప్రార్థిద్దామని ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు. వినాయక నవరాత్రి ఉత్సవాలు అత్యంత శోభాయమానంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.