మల్లేనిపల్లి వినాయక చవితి కి రూ. 10,116 విరాళం అందజేసిన టిడిపి నేత చంద్ర * పరిటాల శ్రీరామ్ సూచనలతో ఆర్థిక సాయం
ధర్మవరం రూరల్ సెప్టెంబర్ 13
మండల పరిధిలోని మల్లేనిపల్లి గ్రామంలో వినాయక చవితి వేడుకలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ ఆదేశాల మేరకు స్థానిక టిడిపి నేత చంద్ర రూ. 10,116/- నిధులను విరాళంగా అందజేశారు.
గ్రామంలో పండుగ వాతావరణం వర్ధిల్లాలని, ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని కోరుతూ ఈ సాయాన్ని నిర్వాహకులకు అందించారు. వినాయక చవితి సందర్భంగా గ్రామ ప్రజలకు ఆర్థిక సాయం అందించిన టిడిపి ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ కి, టిడిపి నేత చంద్రకు మల్లేనిపల్లి గ్రామ ప్రజలు, కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు మరియు అభినందనలు తెలియజేశారు.