కాంట్రాక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి తండ్రి భౌతికకాయానికి మంత్రి ఎన్ఎండి ఫరూక్ నివాళులు
నంద్యాల అర్బన్:నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖ కాంట్రాక్టర్, ఎమ్.ఆర్. చారిటబుల్ ట్రస్ట్ అధినేత రవీంద్రనాథ్ రెడ్డికి పితృవియోగం పట్ల రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రవీంద్రనాథ్ రెడ్డి తండ్రిగారు మరణించారన్న వార్త తెలుసుకున్న మంత్రి ఫరూక్ వెంటనే స్పందించి నంద్యాల ఎన్జీవోస్ కాలనీలోని వారి నివాసానికి చేరుకుని, ఆయన భౌతికకాయానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రవీంద్రనాథ్ రెడ్డిని, వారి కుటుంబ సభ్యులను మంత్రి ఫరూక్ పరామర్శించి ఓదార్చారు.