నంద్యాలలో తాగునీటి సరఫరాలో అంతరాయం
నంద్యాల అర్బన్: నంద్యాల పట్టణంలోని జీవి మాల్ దగ్గర అమృత్ పంపింగ్ పైప్ లైన్ పగిలిపోవడం జరిగినదని నంద్యాల మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. మున్సిపల్ సిబ్బంది మరమ్మత్తు పనులు చేపట్టడం జరుగుతుంది. ఈ క్రింది ప్రాంతాల్లో అనగా మున్సిపల్ ఆఫీస్ ఏరియా, జ్ఞానాపురం , బొమ్మలసత్రం, గట్టలనగర్, ఆర్డీఓ బంగ్లా, గాంధీనగర్, మూలసాగరం, ఏరియాలకు నీటి సరఫరా నందు అంతరాయం కలుగుతుందన్నారు. అలాగే నూనెపల్లి, ఎన్జీఓ కాలనీ, సాయిబాబా నగర్, ఎస్బిఐ కాలనీ, టెక్కే ఏరియాల నందు నీటి సరఫరా నందు ఆలస్యం అవుతుందన్నారు.పట్టణ ప్రజలు ఇందుకు సహకరించవలసినదిగా మరి మరి కోరడమైనది.