గుంటూరు మేయర్ రేసులో మాదాల చైతన్య
14 Sep 2026- Page 4
నేటి దినపత్రిక సూర్య
గుంటూరు 4
సోమవారం 14 సెప్టెంబర్ 2026
(ఎ. పి. స్టేట్ బ్యూరో, సూర్య ప్రతినిధి, అమరావతి ) ప్రజాసేవ ఆయన లక్ష్యం.. అందరినీ అక్కున చేర్చుకునే మనస్తత్వం.. సమాజ అభివృద్ధి వైపు ఆయన చేసే ఆలోచనలు చైతన్యవంతం... వారసత్వ వ్యాపారాన్ని కొనసాగిస్తూ ప్రజాసేవ కోసం అంకితమై త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల ద్వారా ప్రజలకు సేవలు అందించేందుకు అడుగులు వేస్తున్న జన చైతన్య గ్రూప్ మాడాల చైతన్య అందిస్తున్న సేవ, భవిష్యత్తు రాజకీయాలపై సూర్య ప్రత్యేక కధనం..
సేవా, నిబద్ధతే..
ప్రజా చైతన్య
మాదాల చైతన్య ప్రస్థానం
జన చైతన్య గ్రూప్ వారసత్వాన్ని కొనసాగిస్తూ.. విభిన్న రంగాల్లో విస్తరణ-టీడీపీతో తరతరాల అనుబంధం.. పార్టీ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర-అమరావతి ఉద్యమానికి మద్దతు.. సామాజిక సేవలోనూ తనదైన ముద్ర-త్వరలో స్థానిక ఎన్నికలు.. గుంటూరు మేయర్ రేస్లో మాడాల చైతన్య పేరు చర్చనీయాంశంగా మారింది. గుంటూరు నగర రాజకీయాల్లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల వేడి పెరుగుతున్న నేపథ్యంలో.. మేయర్ పీఠాన్ని అశిస్తున్న నేతల పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో వ్యాపార రంగంలో తనదైన గుర్తింపు తెచ్చుకుని, సామాజిక సేవ, రాజకీయ కార్యకలాపాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్న మాదాల చైతన్య పేరు కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు వస్తోంది. మేయర్ రేస్లో ఆయన పేరు వినిపిస్తుండటంతో గుంటూరు నగర రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. వ్యాపార కుటుంబ వారసత్వాన్ని కొనసాగిస్తూనే ప్రజా సేవ, సామాజిక బాధ్యత, రాజకీయ నిబద్ధతకు ప్రాధాన్యం ఇస్తున్న వ్యక్తిగా మాదాల చైతన్య తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారని ఆయన ప్రొఫైల్ పేర్కొంటోంది. కేవలం వ్యాపార కార్యకలాపాలకే పరిమితం కాకుండా ప్రజలతో మమేకం కావడం, అవసరంలో ఉన్నవారికి అండగా నిలవడం, పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండటాన్ని ఆయన తన బాధ్యతగా భావిస్తున్నట్లు చెబుతున్నారు. మనవడు. కొనసాగుతున్న క్రమశిక్షణ, తనకు పదవి
ఉన్నత విద్యతో గుర్తింపు..
చేయడం తన విద్యతోపాటు వ్యాపార నిర్వహణలో అనుభవం మాదాల చైతన్య గుంటూరులో పాఠశాల విద్యను పూర్తి చేసి.. అనంతరం బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీ పొందారు. ఆస్ట్రేలియాలోని జేమ్స్ కుక్ యూనివర్సిటీలో బిజినెస్ మేనేజ్మెంట్ మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు. వాణిజ్యం, వ్యాపార నిర్వహణ, సంస్థాగత అభివృద్ధి, మేనేజ్మెంట్ రంగాల్లో పొందిన విద్య, కుటుంబ వ్యాపారాన్ని ఆధునిక పద్ధతుల్లో విస్తరించేందుకు ఉపయోగపడిందని ఆయన ప్రొఫైల్ వివరిస్తోంది.జన చైతన్య గ్రూప్ కీలక బాధ్యత1985లో వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించిన జన చైతన్య గ్రూప్ రియల్ ఎస్టేట్ రంగంలో దశాబ్దాలుగా కొనసాగుతోంది. కుటుంబం పేర్కొన్న వివరాల ప్రకారం దేశంలోని పలు రాష్ట్రాల్లో 5,000 ఎకరాలకు పైగా రియల్ ఎస్టేట్ లేఅవుట్లను అభివృద్ధి చేసింది. ఓపెన్ హౌసింగ్ ప్లాట్లు అపార్టెమెంట్లు, విల్లాలు, స్వతంత్ర గృహాలు, గేటెడ్ కమ్యూనిటీలు, కమర్షియల్ కాంప్లెక్స్లలు, విద్యా మౌలిక వసతులు వంటి విభిన్న రంగాల్లో గ్రూప్ కార్యకలాపాలను విస్తరించింది. మాదాల చైతన్య జన చైతన్య గ్రూప్ చైర్పర్సన్ గా సంస్థాగత అభివృద్ధి. వ్యూహాత్మక ప్రణాళిక. ఉద్యోగులతో సమన్వయం, వినియోగదారుల అవసరాలు, సామాజిక బాధ్యత వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు సంస్థ పేర్కొంటోంది, రియల్ ఎస్టేట్ నుంచి స్టీల్ రంగంలో కుటుంబ వ్యాపారాన్ని కొనసాగిస్తూనే కొత్త రంగాల్లోకి ప్రవేశించడం మాడాల చైతన్య వ్యాపార దూరదృష్టికి నిదర్శనంగా ఆయన
గుంటూరు మేయర్ రేస్లో మాదాల చైతన్య
వ్యాపార వారసత్వం నుంచి ప్రజా నాయకత్వం వైపు
టీడీపీతో తరతరాల అనుబంధం
1 ప్రజాసేవ నుంచి రాజకీయాల వైపు మాదాల చైతన్య ప్రయాణం
స్థానికులకు సుపరిచితులుగా..
నాలుగు దశాబ్దాల వ్యాపార భాస్కర్ ఐరన్స్ ప్రైవేట్ లిమిటెడ్ను స్థాపించి.. చైతన్య టీఎంటీ బ్రాండ్ పేరుతో స్టీల్ రీబార్ల తయారీలోకి అడుగుపెట్టారు. ప్రకాశం జిల్లాలో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి రియల్ ఎస్టేట్ నుంచి తయారీ వారసత్వం 1984లో గుంటూరులో జన్మించిన మాదాల చైతన్య.. మాదాల రత్నగిరి బాబు పెద్ద కుమారుడు. జన చైతన్య గ్రూప్ వ్యవస్థాపకులు దివంగత మాదాల భాస్కర్రావు, మాదాల శకుంతల దంపతులకు పెద్ద నాలుగు దశాబ్దాలకు పైగా వ్యాపార రంగంలో మాదాల కుటుంబ వారసత్వం.. చిన్ననాటి నుంచే నిబద్ధత, నిజాయితీ, సామాజిక బాధ్యత వంటి విలువలను నేర్పిందని ఆయన పేర్కొంటున్నారు. నాయకత్వం అంటే కేవలం లేదా అధికారం కాదని.. ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకోవడమే అసలైన నాయకత్వమని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండటం, అవసరమైన సమయంలో స్పందించడం, కార్యకర్తలకు అండగా నిలవడం, పార్టీ కార్యక్రమాలను విజయవంతం ప్రాధాన్యతలుగా పేర్కొంటున్నారు. రంగానికి వ్యాపార కార్యకలాపాలను విస్తరించారు. అనంతరం మౌలిక వసతులు, నిర్మాణం, మీడియా, ప్రకటనలు తదితర రంగాల్లోనూ అడుగులు వేశారు. శ్రేష్ఠ గ్రూప్ తో విభిన్న రంగాల్లో విస్తరణ2021లో శ్రేష్ఠ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ను స్థాపించి గ్రూప్ చేపట్టారు. రియల్ ఎస్టేట్, మౌరిక వసతుల అభివృద్ధి, నిర్మాణం మీడియా, ప్రకటనలు తదితర రంగాల్లో కార్యకలాపాలను విస్తరించారు. సుస్థిర అభివృద్ధి, నూతన ఆవిష్కరణలు, వృత్తిపరమైన నిర్వహణ, దీర్ఘకాలిక విలువ సృష్టి వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయన చెబుతున్నారు. వ్యాపారంతోపాటు సామాజిక సేవవ్యాపార కార్యకలాపాలతో పాటు సామాజిక సేవకు కూడా మాడాల చైతన్య ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయన ప్రొఫైల్లో పేర్కొన్నారు. కుల, ఆర్థిక భేదాలకు అతీతంగా అవసరంలో ఉన్నవారికి అండగా నిలపడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థి దశ నుంచే విద్య, క్రీడల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తూ వచ్చారని పేర్కొన్నారు. కుల సమానత్వం, లింగ సమానత్వం, న్యాయం, మానవతా విలువల పట్ల గౌరవం తన వ్యక్తిత్వంలో కీలక భాగమని ఆయన చెబుతున్నారు. టీడీపీతో తరతరాల అనుబంధం మాదాల కుటుంబానికి తెదేపార్టీతో దశాబ్దాల అనుబంధం ఉందని ఆయన ప్రొఫైల్ పేర్కొంటోంది.
అనుచరులు పేర్కొంటున్నారు. 2007లో సాయి
టిడిపి తో విడదీయని అనుబంధం...
విజయవంతంగా
ఎన్టీఆర్ టీడీపీని స్థాపించినప్పటి నుంచి కుటుంబం పార్టీ పట్ల విశ్వాసం, నిబద్ధతతో కొనసాగుతోందని తెలిపారు. పార్టీ కార్యక్రమాలను
నిర్వహించడం, నాయకత్వ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, కార్యకర్తలకు అండగా నిలవడం తన రాజకీయ కార్యకలాపాల్లో ప్రధాన లక్ష్యాలని మాడాల చైతన్య చెబుతున్నారు. అమరావతి ఉద్యమానికి మద్దతుఅమరావతి ఉద్యమం సమయంలో రాజధాని కోసం రైతులు, ప్రజలు చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలిచినట్లు ఆయన ప్రొఫైల్లో పేర్కొన్నారు. ఉద్యమానికి ఆర్థిక, నైతిక సహకారం అందించడంతో పాటు తన స్ఫూర్తితో కుటుంబ సభ్యులు, బంధువులు, గుంటూరు నగర ప్రజలు, నీరుకొండ గ్రామ ప్రజలు కూడా ఉద్యమంలో పాల్గొన్నట్లు వివరించారు. సోషల్ మీడియాపైనా ప్రత్యేక దృష్టివస్తుత రాజకీయాల్లో సోషల్ మీడియా ప్రాధాన్యం పెరిగిన నేపథ్యంలో టీడీపీ కార్యక్రమాలు, పార్టీ విధానాలు, నాయకత్వ నిర్ణయాలు, ప్రజా సమస్యలపై పార్టీ చేస్తున్న పోరాటాలను డిజిటల్ వేదికల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మాదాల చైతన్య కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. గుంటూరు నగరం, పరిసర ప్రాంతాల్లో అవుట్డోర్, డిజిటల్ మీడియా ద్వారా పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పధకాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
మేయర్ రేస్లో చైతన్య...
గుంటూరు నగర మేయర్ పీఠం చుట్టూ రాజకీయ సమీకరణాలు వేదెక్కుతున్న వేళ మాడాల చైతన్య పేరు తెరపైకి రావడం ఆసక్తిని రేపుతోంది. ఇటీవల గుంటూరు మేయర్గా కూటమి అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర ఎన్నికైన విషయం తెలిసిందే. ఇక రానున్న స్థానిక ఎన్నికల నేపథ్యంలో మేయర్ పీఠం కోసం కూటమి వర్గాల్లోనూ పోటీపై రాజకీయ చర్చలు సాగుతున్నాయి. ఇప్పటికే ఇతర నేతల పేర్లు కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న నేపథ్యంలో.. మాదాల చైతన్యకు అవకాశం దక్కుతుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారుతోంది. పదవి కోసం కాదు.. బాధ్యత కోసంరాజకీయాల్లో పదవి కోసం పనిచేయడం కంటే.. పార్టీ కోసం నిజాయితీగా పనిచేసి తన నిబద్ధత, సేవ ద్వారా బాధ్యతను సంపాదించుకోవాలనే విశ్వాసంతో ముందుకు సాగుతున్నట్లు సూడాల చైతన్య చెబుతున్నారు. కష్టకాలంలో పార్టీకి అందగా నిలవడం, కార్యబులకు అందుబాటులో ఉండటం, ప్రజా సమస్యలపై స్పందించడం, పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయడం తన రాజకీయ జీవితంలో ప్రధాన క్ష్యాలని పేర్కొంటున్నారు. వ్యాపార వారసత్వం.. సామాజిక సేవ. టీడీపీతో దీర్ఘకాల అనుబంధం.. పార్టీ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర.. గుంటూరు నగరంతో విస్తృత సంబంధాలు.. ఇవన్నీ కలిపి మాడాల చైతన్యను మేయర్ రేస్లో ఒక ఆసక్తికరమైన పేరుగా నిలుపుతున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ సుగుతోంది. అయితే తుది నిర్ణయం పార్టీ అధిష్టానం, కూటమి సమీకరణాలు, స్థానిక రాజకీయ పరిస్థితులపై ఆధారపడి ఉండనుంది. గుంటూరు మేయర్ పీఠం కోసం పోటీ మరింత రసవత్తరంగా మారుతున్న నేపథ్యంలో.. మాదాల చైతన్య రాజకీయ ప్రస్థానం ఎటు దారితీస్తుందన్నది ఇప్పుడు గుంటూరు రాజకీయాల్లో అసక్తికర చర్చగా మారింది.