వినాయక చవితి వేడుకల్లో పువ్వాడి వెంకటేశ్వర్లు దంపతులు
వినాయక చవితి వేడుకల్లో పువ్వాడి వెంకటేశ్వర్లు దంపతులు
పామూరు, మేజర్ న్యూస్ :
పట్టణంలోని పువ్వాడి లక్ష్మయ్య అపార్ట్మెంట్ ప్రాంగణంలో సోమవారం వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ పామూరు మండల మాజీ అధ్యక్షుడు పువ్వాడి వెంకటేశ్వర్లు దంపతులు హాజరై శ్రీ గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా పువ్వాడి వెంకటేశ్వర్లు దంపతులు వినాయకునికి పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతరం అపార్ట్మెంట్ వాసులతో కలిసి వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్నారు. అపార్ట్మెంట్ వాసులు భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాన్ని నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.
కార్యక్రమంలో అపార్ట్మెంట్ వాసులు, భక్తులు పాల్గొన్నారు.