BREAKING
టీడీపీ జాతీయ కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి పూజలు రామగిరి లో ఘనంగా వినాయక చవితి వేడుకలు.. వినాయకుడి ఆశీస్సులతో ప్రతిఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలి కలెక్టరేట్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు వినాయకునికి ఎమ్మెల్యే దామచర్ల ప్రత్యేక పూజలు వినాయక చవితి వేడుకల్లో పువ్వాడి వెంకటేశ్వర్లు దంపతులు ఆ ఊరి.. గణనాధునికి ‘బొర్ర పోతన’గా పేరు... UNSC శాశ్వత సభ్యత్వానికి భారత్‌ కంటే బలమైన అర్హత ఏ దేశానికీ లేదు: ప్రముఖ అమెరికన్ ఆర్థికవేత్త జెఫ్రీ సాచ్స్ ​గోవా కోర్టులో లొంగిపోయిన ‘తెహెల్కా’ మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ ​పనాజీ: ఉమ్మడి జిల్లా ప్రజలకు, కార్యకర్తలకు వినాయక చవితి శుభాకాంక్షలు మంత్రి దామోదర్ రాజనర్సింహ ఎల్లంపేట మున్సిపల్ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు విఘ్నేశ్వరుని తొలి పూజలో శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి మట్టి గణపతి తోనే పర్యావరణ పరిరక్షణ* *జిల్లా కలెక్టర్ బంగ్లాలో వినాయక చవితి పూజలు* వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తిరుమల జి ఎన్ సి టోల్గేట్ వద్ద చిరుత కలకలం

టీడీపీ జాతీయ కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి పూజలు

Select Suryaa Now
టీడీపీ జాతీయ కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి పూజలు

టీడీపీ జాతీయ కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి పూజలు

సూర్య, స్టేట్ బ్యూరో : అమరావతి

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో విఘ్నేశ్వరుడికి టీడీపీ నాయకులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాథుడికి పుష్పాలంకరణ చేసి, వేద మంత్రోచ్ఛారణల మధ్య పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.

టీడీపీ నాయకులు విఘ్నేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి, పార్టీకి, రాష్ట్ర ప్రజలకు సుఖశాంతులు, సుభిక్షం కలగాలని ఆకాంక్షించారు. ప్రజల జీవితాల్లోని విఘ్నాలు తొలగించి, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని గణనాథుడిని ప్రార్థించారు.

వినాయక చవితి సందర్భంగా జాతీయ కార్యాలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.