BREAKING
టీడీపీ జాతీయ కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి పూజలు రామగిరి లో ఘనంగా వినాయక చవితి వేడుకలు.. వినాయకుడి ఆశీస్సులతో ప్రతిఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలి కలెక్టరేట్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు వినాయకునికి ఎమ్మెల్యే దామచర్ల ప్రత్యేక పూజలు వినాయక చవితి వేడుకల్లో పువ్వాడి వెంకటేశ్వర్లు దంపతులు ఆ ఊరి.. గణనాధునికి ‘బొర్ర పోతన’గా పేరు... UNSC శాశ్వత సభ్యత్వానికి భారత్‌ కంటే బలమైన అర్హత ఏ దేశానికీ లేదు: ప్రముఖ అమెరికన్ ఆర్థికవేత్త జెఫ్రీ సాచ్స్ ​గోవా కోర్టులో లొంగిపోయిన ‘తెహెల్కా’ మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ ​పనాజీ: ఉమ్మడి జిల్లా ప్రజలకు, కార్యకర్తలకు వినాయక చవితి శుభాకాంక్షలు మంత్రి దామోదర్ రాజనర్సింహ ఎల్లంపేట మున్సిపల్ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు విఘ్నేశ్వరుని తొలి పూజలో శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి మట్టి గణపతి తోనే పర్యావరణ పరిరక్షణ* *జిల్లా కలెక్టర్ బంగ్లాలో వినాయక చవితి పూజలు* వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తిరుమల జి ఎన్ సి టోల్గేట్ వద్ద చిరుత కలకలం

ఆ ఊరి.. గణనాధునికి ‘బొర్ర పోతన’గా పేరు...

Select Suryaa Now
ఆ ఊరి.. గణనాధునికి ‘బొర్ర పోతన’గా పేరు...

ఆ ఊరి.. గణనాధునికి ‘బొర్ర పోతన’గా పేరు....

తెలంగాణలోనే ఎత్తైన రాతి విగ్రహంగా గుర్తింపు....


మద్దూరు ;  సహజంగా గణనాధుని అష్టోత్తర శతనామావళితో (108 పేర్లతో) పూజిస్తాం. ఈ పేర్లకు తోడు ఆ గ్రామస్తులు గణనాథునికి మరో పేరును జోడించారు. సిద్దిపేట జిల్లాలోని మద్దూరు మండలం వల్లంపట్లలో కాకతీయుల కాలం నాటి ఐదున్నర అడుగుల ఎత్తులో రాతి విగ్రహం భక్తులకు దర్శనమిస్తుంది. సుమారు 20 ఏండ్ల క్రితం కూటిగల్ గ్రామానికి వెళ్లే దారి వేముల చెరువు ప్రాంతంలో ఓ వ్యవసాయ బావి దగ్గర పడి ఉన్న ఏకదంతుని రాతి విగ్రహంతో పాటు వివిధ దేవతల విగ్రహాలను స్థానికులు పాఠశాల ప్రాంగణంలోకి తరలించారు. అక్కడ నుండి ఏకదంతుని రాతి విగ్రహాన్ని స్థానిక ఆంజనేయ స్వామి ఆలయం కు తీసుకోవచ్చారు.ఎత్తైన రాతి విగ్రహం ఎదుట పెద్ద రాతి కలశం ఉండేది. రెండు మూడేళ్ల క్రితం ఈ రాతి కలశంను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ప్రస్తుతం ఏకదంతుని రాతి విగ్రహానికి ఎలాంటి ఆలయంను నిర్మించలేదు. దీంతో వినాయక విగ్రహంతో పాటు పలు దేవతల విగ్రహాలు ఆంజనేయ సమి ఆలయ ప్రాంగణంలో నిర్లక్ష్యంగా పడి ఉన్నాయి. తెలంగాణలోని ఎత్తైన రాతి విగ్రహంగా గుర్తింపు పొందిన బొర్ర పోతన వినాయ కునికి ఆలయం నిర్మించాలని భక్తులు కోరుతున్నారు.