BREAKING
UNSC శాశ్వత సభ్యత్వానికి భారత్‌ కంటే బలమైన అర్హత ఏ దేశానికీ లేదు: ప్రముఖ అమెరికన్ ఆర్థికవేత్త జెఫ్రీ సాచ్స్ ​గోవా కోర్టులో లొంగిపోయిన ‘తెహెల్కా’ మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ ​పనాజీ: ఉమ్మడి జిల్లా ప్రజలకు, కార్యకర్తలకు వినాయక చవితి శుభాకాంక్షలు మంత్రి దామోదర్ రాజనర్సింహ ఎల్లంపేట మున్సిపల్ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు విఘ్నేశ్వరుని తొలి పూజలో శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి మట్టి గణపతి తోనే పర్యావరణ పరిరక్షణ* *జిల్లా కలెక్టర్ బంగ్లాలో వినాయక చవితి పూజలు* వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తిరుమల జి ఎన్ సి టోల్గేట్ వద్ద చిరుత కలకలం కార్గిల్ యుద్ధ వీరుడుపై ఇనుపరాడితో దాడి విఘ్నాలను తొలగించి.. విజయాలను అందించే విఘ్నేశ్వరుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ, పవిత్రమైన "వినాయక చవితి" సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఏఐపీసి చైర్మన్ మధుయాష్కి గౌడ్ ను కలిసిన సర్పంచ్ కుంభం మంజుల సతీష్ గౌడ్ వినాయకుని కృపతో ప్రతి అడుగులో విజయాలు చేకూరాలి కళాకారుల బతుకులతో ఆటలాడుతున్న... కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం-గిలకత్తుల రమెష్ గౌడ్ యాసిడ్ దాడిలో గాయపడిన వివాహిత చికిత్స పొందుతూ మృతి మల్లేనిపల్లి వినాయక చవితి కి రూ. 10,116 విరాళం అందజేసిన టిడిపి నేత చంద్ర * పరిటాల శ్రీరామ్ సూచనలతో ఆర్థిక సాయం

UNSC శాశ్వత సభ్యత్వానికి భారత్‌ కంటే బలమైన అర్హత ఏ దేశానికీ లేదు: ప్రముఖ అమెరికన్ ఆర్థికవేత్త జెఫ్రీ సాచ్స్

Select Suryaa Now
UNSC శాశ్వత సభ్యత్వానికి భారత్‌ కంటే బలమైన అర్హత ఏ దేశానికీ లేదు: ప్రముఖ అమెరికన్ ఆర్థికవేత్త జెఫ్రీ సాచ్స్

UNSC శాశ్వత సభ్యత్వానికి భారత్‌ కంటే బలమైన అర్హత ఏ దేశానికీ లేదు: ప్రముఖ అమెరికన్ ఆర్థికవేత్త జెఫ్రీ సాచ్స్
​న్యూఢిల్లీ:
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి లో ఆరో శాశ్వత సభ్యదేశంగా చేరేందుకు భారత్‌ కంటే బలమైన అర్హత కలిగిన దేశం మరొకటి లేదని ప్రముఖ అమెరికన్ ఆర్థికవేత్త, కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ జెఫ్రీ సాచ్స్  స్పష్టం చేశారు.
​ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్న భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించే విషయంలో చైనా కూడా మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. భారత్‌కు ఉన్న అపారమైన జనాభా, వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ, పెరుగుతున్న అంతర్జాతీయ పరపతి మరియు ప్రపంచ వేదికపై అది పోషిస్తున్న దౌత్య పాత్ర.. UNSC శాశ్వత సభ్యత్వానికి భారత్ చేస్తున్న వాదనను మరింత బలోపేతం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
​అంతర్జాతీయ వేదికలపై వర్ధమాన దేశాలకు ప్రాధాన్యత పెంచాలని ఇటీవల 'బ్రిక్స్'  కూటమి గట్టిగా గళమెత్తిన నేపథ్యంలో జెఫ్రీ సాచ్స్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాగా, ప్రస్తుతం భద్రతా మండలిలో 15 సభ్యదేశాలు ఉన్నాయి. ఇందులో అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్ శాశ్వత సభ్యదేశాలుగా ఉండగా.. మిగిలిన 10 తాత్కాలిక సభ్యదేశాలను రెండేళ్ల కాలపరిమితితో యూఎన్ జనరల్ అసెంబ్లీ ఎన్నుకుంటుంది.