రామగిరి లో ఘనంగా వినాయక చవితి వేడుకలు..
రామగిరి మండల వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగాయి. ఊరూరా మండపాలు ఏర్పాటు చేసి, ప్రతిమలను ప్రతిష్టించి ప్రజలు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. గ్రామాలు, పట్టణాల్లోని వీధి వీధినా రకరకాల థీమ్‌లతో ఆకర్షణీయమైన గణపతి మండపాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రామగిరి మండల కేంద్రంలోని శ్రీ సాయి కాలనీలో
ఉదయం నుంచే భక్తులు కుటుంబసమేతంగా మండపాల వద్దకు చేరుకుని గణనాథునికి లడ్డూలు, కుడుములు, ఉండ్రాళ్లు నైవేద్యంగా సమర్పించి ప్రత్యేక అర్చనలు చేశారు. పలు మండపాల నిర్వాహకులు భక్తుల కోసం కోలాటాలు, భజనలు, అన్నదాన కార్యక్రమాలు మరియు పిల్లలకు సాంస్కృతిక పోటీలను ఏర్పాటు చేశారు.