మట్టి గణపతులనే పూజిద్దాం పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన
మట్టి గణపతులనే పూజిద్దాం
పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన.
పటాన్ చెరు: వినాయక చవితి సందర్భంగా పటాన్ చెరు నియోజవర్గం ముత్తంగి జిహెచ్ఎంసి డివిజన్ లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో విద్యార్థులకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతులను పూజించాలని విద్యార్థులకు సూచించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ సి.హెచ్. రాజేష్ మాట్లాడుతూ.. వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితమయ్యే అవకాశం ఉందని తెలిపారు. అందువల్ల సహజసిద్ధమైన మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు.విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు మట్టి గణపతుల వినియోగాన్ని ప్రోత్సహించాలని సూచించారు.కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.