BREAKING
మట్టి గణపయ్యకు తొలి పూజ చేసిన బుయ్యని శ్రీనివాస్ రెడ్డి (బి ఎస్ ఆర్ ) సంగారెడ్డి జిల్లాలో 14 మి.మీ. సగటు వర్షపాతం ఆర్‌.సీ.పురంలో అత్యధికంగా 55.8 మి.మీ. వర్షం.. జిన్నారంలో 47.8 మి.మీ. గణపతికి సీఎం పూజలు ప్రజాసేవే దామోదర్ రెడ్డి ఆశయం, మానవతా సేవే దామన్నకు నిజమైన నివాళి:- చెవిటి వెంకన్న యాదవ్ రుద్రారం శ్రీ గణేష్ దేవస్థానంలో ప్రత్యేక అలంకరణ నవరాత్రుల తొలిరోజు హరిద్రవర్ణం అలంకరణలో స్వామివారి దర్శనం. అష్ట స్వయంవ్యక్త క్షేత్రం శ్రీమూష్నం.. సర్వరోగాలు నయం చేసే నిత్య పుష్కరిణి, మత సామరస్య విశేషాలు ఓంకారేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు మట్టి గణపతులనే పూజిద్దాం పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన ఇంద్రకీలాద్రిపై కొలువైన అపరాజితా దేవి విశిష్టత.. సర్వకార్య విజయాలను ప్రసాదించే చండీ సప్తశతి స్తోత్రం టీడీపీ జాతీయ కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి పూజలు రామగిరి లో ఘనంగా వినాయక చవితి వేడుకలు.. వినాయకుడి ఆశీస్సులతో ప్రతిఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలి కలెక్టరేట్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు వినాయకునికి ఎమ్మెల్యే దామచర్ల ప్రత్యేక పూజలు వినాయక చవితి వేడుకల్లో పువ్వాడి వెంకటేశ్వర్లు దంపతులు

సంగారెడ్డి జిల్లాలో 14 మి.మీ. సగటు వర్షపాతం ఆర్‌.సీ.పురంలో అత్యధికంగా 55.8 మి.మీ. వర్షం.. జిన్నారంలో 47.8 మి.మీ.

Select Suryaa Now
సంగారెడ్డి జిల్లాలో 14 మి.మీ. సగటు వర్షపాతం ఆర్‌.సీ.పురంలో అత్యధికంగా 55.8 మి.మీ. వర్షం.. జిన్నారంలో 47.8 మి.మీ.

సంగారెడ్డి జిల్లాలో 14 మి.మీ. సగటు వర్షపాతం
ఆర్‌.సీ.పురంలో అత్యధికంగా 55.8 మి.మీ. వర్షం.. జిన్నారంలో 47.8 మి.మీ.

సంగారెడ్డి,  ; సంగారెడ్డి జిల్లాలో సోమవారం పలు మండలాల్లో వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా సగటున 14.0 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు జిల్లా వర్షపాత నివేదిక వెల్లడించింది. 14వ తేదీ ఉదయం 8:30 గంటల వరకు నమోదైన వివరాల ప్రకారం రామచంద్రాపురం మండలంలో అత్యధికంగా 55.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. 
రామచంద్రాపురం తర్వాత జిన్నారంలో 47.8 మి.మీ., గుమ్మడిదలలో 42.0 మి.మీ., అమీన్‌పూర్‌లో 40.6 మి.మీ., సంగారెడ్డిలో 12.9 మి.మీ., పటాన్‌చెరులో 29.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. పలు ఇతర మండలాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది.

11 మండలాల్లో లోటు వర్షపాతం

జిల్లా వర్షపాత పరిస్థితిని పరిశీలిస్తే 2 మండలాల్లో భారీ అధిక వర్షపాతం  ఒక మండలంలో అధిక వర్షపాతం, 13 మండలాల్లో సాధారణ వర్షపాతం, 11 మండలాల్లో లోటు వర్షపాతం ఒక మండలంలో తక్కువ వర్షపాతం (అతి తక్కువ ) నమోదైనట్లు నివేదిక పేర్కొంది. జిల్లా మొత్తంగా జూన్ 1 నుంచి సెప్టెంబర్ 14 వరకు 599.4 మి.మీ. సాధారణ వర్షపాతానికి గాను 513.7 మి.మీ. వర్షపాతం నమోదైంది. దీంతో సాధారణంతో పోలిస్తే 14.3 శాతం లోటు నమోదై, జిల్లా వర్షపాత స్థితి నార్మల్’ గా పేర్కొంది.

సీజన్‌ వారీగా..

దక్షిణ పశ్చిమ రుతుపవనాల కాలంలో జూన్‌లో సాధారణ 120.0 మి.మీ.కు గాను 132.0 మి.మీ. (10 శాతం అధికంగా), జూలైలో సాధారణ 191.1 మి.మీ.కు గాను 203.2 మి.మీ. (6.3 శాతం అధికంగా) వర్షపాతం నమోదైంది. అయితే ఆగస్టులో సాధారణ 191.2 మి.మీ.కు గాను 134.6 మి.మీ. మాత్రమే నమోదై 29.6 శాతం లోటు ఏర్పడింది. సెప్టెంబర్‌లో ఇప్పటివరకు సాధారణ 156.0 మి.మీ.కు గాను 43.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. 14వ తేదీ నమోదైన వర్షపాతంలో ఆర్‌.సీ.పురం 55.8 మి.మీ.తో జిల్లాలో అగ్రస్థానంలో నిలిచింది