మట్టి గణపతి పర్యావరణానికి రక్ష: ఉప్పల్ ఎమ్మెల్యే
పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకుల వినియోగం ఎంతో అవసరం: బండారి లక్ష్మారెడ్డి
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ చిలుక నగర్ లో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు హాజరై మట్టి వినాయకులను భక్తులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను ప్రతిష్ఠించి పూజించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడేందుకు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితమయ్యే అవకాశం ఉందని, అందుకే పర్యావరణహితమైన మట్టి వినాయకుల వినియోగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రకృతిని పరిరక్షించడంతో పాటు భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ పర్యావరణహిత పద్ధతులను పాటించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
“భక్తితో బప్పాను స్వాగతిద్దాం… మట్టి వినాయకుడిని పూజించి ప్రకృతిని కాపాడుదాం” అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రజల్లో పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు దోహదపడింది.
ఈ కార్యక్రమంలో BRS పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళలు, భక్తులు, యువత తదితరులు పాల్గొన్నారు.