మహిళపై యాసిడ్ దాడి… బిక్కనూర్ మండలంలో ఘటన.. పరిస్థితి విషమం
సూర్య బిక్కనూర్:
కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండల కేంద్రానికి చెందిన గంగల్లి మధు కుమార్తె దివ్యవాణి (33)పై యాసిడ్ దాడి జరిగిన ఘటన మండలంలో కలకలం రేపింది. కుటుంబ కలహాల నేపథ్యంలో అత్తారింటి నుంచి పుట్టింటికి వచ్చిన దివ్యవాణి ఈ నెల 11న అదృశ్యమైంది. దీంతో ఆమె తండ్రి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఈ క్రమంలో ఆదివారం రాత్రి మండలంలోని జంగంపల్లి శివారులో దివ్యవాణిపై గుర్తుతెలియని వ్యక్తులు యాసిడ్ దాడికి పాల్పడినట్లు సమాచారం. దాడికి పాల్పడింది ఎవరు, ఘటనకు గల కారణాలు ఏమిటన్నది ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు దివ్యవాణి నుంచి వివరాలు సేకరిస్తూ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.