టియుడబ్ల్యుజె (ఐజెయు) మొదటి కార్యవర్గ సమావేశం
జర్నలిస్టుల సంక్షేమానికి ప్రాధాన్యత
నారాయణఖేడ్: స్థానిక కార్తికేయ రెస్టారెంట్‌లో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ-IJU) నూతన కార్యవర్గ సభ్యుల తొలి ఈసీ (EC) సమావేశం జిల్లా యూనియన్ అధ్యక్షుడు ఎండీ ఆసిఫ్ అధ్యక్షతన ఆదివారం ఘనంగా జరిగింది. ఈ భేటీలో వర్కింగ్ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై, భవిష్యత్ కార్యచరణ ప్రణాళికపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సంక్షేమానికి మరియు సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా నాయకులు స్పష్టం చేశారు.
అదేవిధంగా హైదరాబాద్‌లో నిర్వహించిన 'మిస్టర్ తెలంగాణ' పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన నారాయణఖేడ్‌కు చెందిన అక్బర్ అలీతో పాటు ఫిట్నెస్ ట్రైనర్ మచేందర్‌ను యూనియన్ నాయకులు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు హసీబ్ పటేల్, డివిజన్ అధ్యక్షులు సత్యం, ప్రధాన కార్యదర్శి కే. భూమయ్య, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు బి. రాములు, ప్రధాన కార్యదర్శి ఎం.ఏ. జావిద్, ఇతర కార్యవర్గ ప్రతినిధులు మరియు జర్నలిస్టులు పాల్గొన్నారు.