నాగర్‌కర్నూల్‌లో ఘనంగా ఆర్.కృష్ణయ్య జన్మదిన వేడుకలు
నాగర్‌కర్నూల్: బీసీ ఉద్యమ పితామహుడు, అభినవ జ్యోతిరావు పూలే టైగర్ ఆర్.కృష్ణయ్య జన్మదిన వేడుకలను నాగర్‌కర్నూల్ జిల్లా బీసీ కార్యాలయంలో ఆదివారం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి పాలమూరు జిల్లా అధ్యక్షుడు కాళ్ల నిరంజన్ మాట్లాడుతూ.. ఆర్.కృష్ణయ్య పదవీ వ్యామోహాన్ని పక్కనబెట్టి 54 ఏళ్లుగా బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నారని కొనియాడారు. ఆయన ఉద్యమాల ఫలితంగానే బీసీ విద్యార్థులకు హాస్టళ్లు, స్కాలర్‌షిప్‌లు, గురుకులాలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు.
విద్య ద్వారానే బీసీ యువత సాధికారత సాధ్యమని నమ్మిన కృష్ణయ్య, లక్షలాది మంది యువతలో ప్రశ్నించే చైతన్యాన్ని నింపారని చెప్పారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కుంభం మల్లేష్ గౌడ్, సీనియర్ నాయకులు పబ్బతి శ్రీనివాసులు, నిరంజన్ యాదవ్, రిపోర్టర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.