ఏలూరి మాధవరావు ఉచిత వాటర్ క్యాన్లు పంపిణీ
ఏలూరి మాధవరావు ఉచిత వాటర్ క్యాన్లు పంపిణీ
- రూ.1.70 లక్షల వ్యయంతో ఇంటింటికీ 20 లీటర్ల మినరల్ వాటర్ క్యాన్లు పంపిణీ
పామూరు, మేజర్ న్యూస్ : సేవా కార్యక్రమాలతో ప్రజలకు అండగా నిలుస్తున్న తెలుగుదేశం పార్టీ కంబాలదిన్నె తెలుగు యువత గ్రామ కమిటీ అధ్యక్షుడు ఏలూరి మాధవరావు(కోటయ్య) మానవత్వాన్ని చాటుకున్నారు. కంబాలదిన్నె గ్రామంలోని ఎస్‌ఎల్‌వీ సేవా సమితి ఆధ్వర్యంలో ఏలూరి మాధవరావు సుమారు రూ.1.70 లక్షల వ్యయంతో 20 లీటర్ల మినరల్ వాటర్ క్యాన్లను ఇంటింటికీ ఉచితంగా పంపిణీ చేశారు. 1000 క్యాన్లను గ్రామంలోని కుటుంబాలకు అందజేశారు.
ప్రజలకు అవసరమైన సమయంలో తాగునీటి క్యాన్లను ఇంటింటికీ ఉచితంగా అందించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్న ఏలూరి మాధవరావును గ్రామస్తులు అభినందించారు.ఈ కార్యక్రమంలో పామూరు గద్దె గంగయ్య చౌదరి, చుంచు కొండయ్య, మన్నం రమణయ్య, గోళ్ల రమేష్, సనుమూరి శ్రీను, పొన్నగంటి పెద్ద రోశయ్య, పొన్నగంటి చిన్న రోశయ్య, ఏలూరి మహేశ్వరరావు, యాదాల కొండయ్య, యాదాల చెన్నకేశవులు, మల్లెల శ్రీనివాసులు, ఉమ్మడి పద్మ, ఒంగోలు ప్రతాప్, బెజవాడ రఘుబాబు, కోలా కృష్ణమూర్తి, కొమ్మలపాటి రామయ్య, సూరా రమేష్, దూదుపల్లి రామకృష్ణ, చుంచు గోపి, కొండమాల కొండయ్య, గోళ్ల మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు.