వైద్య సేవలను పల్లె ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యం
వైద్య సేవలను పల్లె ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యం
- తలకొండపాడులో 47వ ఉచిత వైద్య శిబిరం నిర్వహించిన డాక్టర్ మల్లికార్జున రెడ్డి
పీసీపల్లి, (పామూరు), మేజర్ న్యూస్ : గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను చేరువ చేయాలనే ఉద్దేశంతో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని రవణమ్మ మెమోరియల్ మల్లికార్జున రెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పొలిమేర మల్లికార్జున రెడ్డి తెలిపారు. పీసీపల్లి మండలంలోని తలకొండపాడు గ్రామంలో ఆదివారం సాయంత్రం 47వ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పామూరు రవణమ్మ మెమోరియల్ మల్లికార్జున రెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజ్మెంట్ డైరెక్టర్ పొలిమేర మల్లికార్జున రెడ్డి , కనిగిరి పివిఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజ్మెంట్ డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ ఎముకలు, కీళ్ల సమస్యలతో బాధపడుతున్న పేదలకు వైద్య పరీక్షలు నిర్వహించి వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో వైద్య శిబిరాల నిర్వహణను కొనసాగిస్తున్నామని డాక్టర్ మల్లికార్జున రెడ్డి తెలిపారు.