BREAKING
తెలంగాణలో మరోసారి వర్షాల హెచ్చరిక.. రేపు ఉదయం వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు మహిళల ఆసియా కప్ ఫైనల్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఇనుమడించిన దేశ ఖ్యాతి అఫ్గానిస్థాన్‌తో తొలి టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా నెట్టింట చక్కర్లు కొడుతున్న రాజమౌళి-మహేష్ బాబు సినిమా షూటింగ్ లీక్ ఫొటో.. డైలమాలో ఫ్యాన్స్ వినాయకుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి జావా సముద్రంలో ఫెర్రీ ప్రమాదం.. 6 మంది మృతి ఆర్య వైశ్యులకు అండగా ప్రజా ప్రభుత్వం ఆఫ్రికన్ యూనియన్ ఛైర్‌పర్సన్‌తో ప్రధాని మోదీ భేటీ పుట్టినరోజు వేడుకల సందర్భంగా నెహ్రూ జూపార్క్‌లో తెల్ల పులి పిల్లను దత్తత తీసుకున్న యువకుడు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రామఫోసాతో ప్రధాని మోదీ భేటీ నైజీరియా ఉపాధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ ప్రపంచ వ్యాక్సిన్ సరఫరాలో భారత్ అగ్రస్థానం పల్లెనిద్రతో ప్రజలకు చేరువగా ఎస్‌ఐ అనూక్ ‘గణేష్ జ్ఞానార్థి ఎగ్జిబిషన్’ను ప్రారంభించిన అమిత్ షా

వెంకటాపురంలో మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేసిన పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్* *ప్రతి ఇంటికి మట్టి విగ్రహాన్ని అందజేసిన ఎమ్మెల్యే సునీత, శ్రీరామ్

Select Suryaa Now
వెంకటాపురంలో మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేసిన పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్*  *ప్రతి ఇంటికి మట్టి విగ్రహాన్ని అందజేసిన ఎమ్మెల్యే సునీత, శ్రీరామ్

*

రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జ్ పరిటాల శ్రీరామ్ తన స్వగ్రామం రామగిరి మండలం వెంకటాపురంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. తమ కుటుంబ సభ్యులతో కలిసి ప్రతి ఇంటికి మట్టి వినాయక విగ్రహాన్ని అందజేశారు. వెంకటాపురం తో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కూడా ఈ మట్టి వినాయక విగ్రహాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక చవితి అంటే ఎంతో సందడిగా చేసుకునే పండుగ అని... అయితే ఇటీవల ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు వాడటం వల్ల నీటి కాలుష్యం బాగా పెరిగిందన్నారు. దీనిని నివారించేందుకు ప్రతి ఒక్కరు మట్టి విగ్రహాలను పూజించాలన్న లక్ష్యంతోనే ఈ విగ్రహాలు పంపిణీ చేసినట్లు చెప్పారు. పండుగ అన్నది పర్యావరణాన్ని కాపాడే విధంగా ఉండాలన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం మట్టి వినాయక విగ్రహాలను గరికతో పూజించాలని... దీనిని ఎవరు మర్చిపోవద్దని సూచించారు. రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గ ప్రజలకు వారు ప్రత్యేకంగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.....