వినాయకుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి
వినాయకుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి
డాక్టర్ పొలిమేర మల్లికార్జున రెడ్డి
పామూరు, మేజర్ న్యూస్ : వినాయక చవితి పర్వదినాన్ని ప్రజలంతా భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని రవణమ్మ మెమోరియల్ మల్లికార్జున రెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పొలిమేర మల్లికార్జున రెడ్డి కోరారు. వినాయక చవితి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. గణనాథుని ఆశీస్సులతో ప్రజలు తలపెట్టిన ప్రతి కార్యం విజయవంతం కావాలని, ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఆ విఘ్నేశ్వరుడు కాపాడాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ప్రజల కుటుంబాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని, రసాయన రంగులు లేని విగ్రహాలను వినియోగించి ప్రకృతిని కాపాడాలని డాక్టర్ పొలిమేర మల్లికార్జున రెడ్డి కోరారు.