BREAKING
భారత్-వియత్నాం రక్షణ చర్చలు ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. 90,862 మంది అర్హత సాధించినట్లు వెల్లడి గాంధీనగర్‌లో ప్రపంచ సర్క్యులర్ ఎకానమీ ఫోరమ్ 2026 గణేశ చతుర్థి సందర్భంగా దేశప్రజలకు శుభాకాంక్షలు ఉగాండా ఉపాధ్యక్షురాలు అలుపోతో ప్రధాని మోదీ భేటీ ఫిలిప్పీన్స్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ వినాయకుడి ఆశీస్సులతో ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలి ఏలూరి మాధవరావు ఉచిత వాటర్‌ క్యాన్లు పంపిణీ గుంటూరు మేయర్ రేస్‌లో మాదాల చైతన్య వైద్య సేవలను పల్లె ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యం వెంకటాపురంలో మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేసిన పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్* *ప్రతి ఇంటికి మట్టి విగ్రహాన్ని అందజేసిన ఎమ్మెల్యే సునీత, శ్రీరామ్ గొట్టిపాటి లక్ష్మీ కృషి తో తొలగిన తాగునీరు ఇబ్బందులు. ప్రకాశం జిల్లా ప్ర‌జ‌ల‌కు వినాయ‌కచవితి శుభాకాంక్ష‌లు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి వినాయకచవితి శుభాకాంక్షలు ఎంపీ మాగుంట

గొట్టిపాటి లక్ష్మీ కృషి తో తొలగిన తాగునీరు ఇబ్బందులు.

Select Suryaa Now
గొట్టిపాటి  లక్ష్మీ కృషి తో తొలగిన తాగునీరు ఇబ్బందులు.

గొట్టిపాటి  లక్ష్మీ కృషి తో తొలగిన తాగునీరు ఇబ్బందులు. 

మంత్రి నిమ్మల ,కలెక్టర్ కు సమస్య వివరించిన డాక్టర్ లక్ష్మి.

సానుకూలంగా స్పందించి నీటిని విడుదల చేయించిన మంత్రి నిమ్మల రామానాయుడు. 

దర్శి కి చేరుకున్న సాగర్ జలాలు.

మంత్రి నిమ్మల కలెక్టర్ రాజా బాబుకు కృతజ్ఞతలు తెలిపిన గొట్టిపాటి లక్ష్మి. 

దర్శి  నియోజకవర్గ ఇన్ చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ కృషి తో త్రాగు నీటి కి అవసరమైన సాగర్ జలాలను దర్శి నియోజకవర్గానికి రప్పించేందుకు చేసిన కృషి ఫలించింది.  నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు , జిల్లా కలెక్టర్ రాజబాబు, అధికారులతో డాక్టర్ లక్ష్మీ పలు మార్లు మాట్లాడి చేసిన కృషి ఫలించింది.  ఆదివారం సాయంత్రం నియోజకవర్గం లోని రాజానగరం , మోదేపల్లి మేజర్ కాలువల్లో సాగర్ జలాలు ప్రవేశించడం శుభపరిణామం అన్నారు. విడుదలైన సాగర్ జలాలు ద్వారా నియోజకవర్గం లోని త్రాగు నీటి అవసరమైన ఆర్డబ్ల్యూఎస్  ట్యాంక్ లు నింపుకోవాలన్నారు.

ఎల్వీనో ప్రభావంతో తీవ్ర వర్షభావ పరిస్థితులు ఏర్పడి త్రాగు నీటికి ఇబ్బందులు ఏర్పడ్డ ఈ పరిస్థితుల్లో సాగర్ జలాలు విడుదల చేయడం శుభపరిణామన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు, కలెక్టర్ , సాగర్ కెనాల్ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.  ఈ సందర్భంగా లక్ష్మీ మాట్లాడుతూ సాగర్ జలాలను కేవలం త్రాగు నీటికే వాడుకోవాలని వృధ చేయవద్దని ఆమె విజ్ఞప్తి చేసారు.