గణేశ చతుర్థి సందర్భంగా దేశప్రజలకు శుభాకాంక్షలు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
న్యూఢిల్లీ:గణేశ చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశంలోని మరియు విదేశాల్లో ఉన్న భారతీయులందరికీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. విఘ్నేశ్వరుడు జ్ఞానం, శ్రేయస్సు మరియు శుభప్రదమైన ఆరంభాలకు ప్రతీక అని ఆమె తన సందేశంలో కొనియాడారు.
ఈ పండుగ ప్రజల జీవితాల్లో నూతన శక్తిని, జ్ఞానాన్ని, సానుకూలతను నింపి, కొత్త సంకల్పాలతో ప్రగతి పథంలో ముందుకు సాగేలా ప్రేరేపిస్తుందని రాష్ట్రపతి ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరికీ సంతోషం, శాంతి, ఆరోగ్యం, శ్రేయస్సు ప్రసాదించాలని గణనాథుడిని ప్రార్థించారు. ఇదే సమయంలో, దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయాలని పౌరులకు రాష్ట్రపతి ముర్ము పిలుపునిచ్చారు.