BREAKING
వినాయక్ నగర్, నేరేడ్‌మెట్‌లో వైభవంగా దేవీ శరన్నవరాత్రులు: పూజల్లో పాల్గొన్న బీఆర్ఎస్ సీనియర్ నాయకులు! మైసమ్మ సన్నిధిలో భక్తుల సందడి అమ్మవారి చల్లని చూపు ప్రజలందరిపై ఉండాలి ఎగుమతిదారులకు ఫ్రీ ట్రేడ్ ఒప్పారాలపై అవగాహన అమ్మవారి ఆశీస్సులతో అందరూ ప్రజలందరూ సంతోషంగా ఉండాలి దేవీ మండపాలను దర్శించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ సరికొత్త రికార్డులు.. మూడు రోజుల్లో రూ.144 కోట్లు దాటిన ‘జైలర్ 2’ వసూళ్లు! బ్రిటన్ తీరంలో ముగిసిన 'కొంకణ్-26' నావికాదళ విన్యాసాలు బాక్సాఫీస్ వద్ద రాజ్ కుమార్ రావ్ ‘ప్రహార్’ జోరు.. రెండు రోజుల్లో రూ.5 కోట్లు దాటిన వసూళ్లు! సీషెల్స్‌లో ముగిసిన భారత నావికాదళ శిక్షణ స్క్వాడ్రన్ పర్యటన కార్వార్ నావికాదళ స్థావరంలో 'ప్రాజెక్ట్ సీబర్డ్' మౌలిక వసతుల ప్రారంభం బాక్సాఫీస్ వద్ద రౌడీ హీరో హవా.. రెండు రోజుల్లో రూ.16 కోట్లు దాటిన ‘రణబాలి’ వసూళ్లు! పండుగల సీజన్‌లో నకిలీ ఆఫర్లు, సైబర్ మోసాలపై జాగ్రత్త బాక్సాఫీస్ వద్ద 'నయీ నవేలీ' జోరు.. రూ.7 కోట్లు దాటిన యామీ గౌతమ్ మైథలాజికల్ ఫాంటసీ మూవీ వసూళ్లు! గ్వాలియర్‌లో ట్రక్కు అదుపుతప్పి 13 మంది మృతి, సంతాపం తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని అంతరిక్ష ప్రయోగంలో కొత్త చరిత్ర సృష్టించనున్న జపాన్

ఉజ్జయినిలో మహంకాళి - ఆర్తజన సర్వరక్షకి వైభవం (అష్టాదశ శక్తిపీఠాలలో 9వది)

Select Suryaa Now
ఉజ్జయినిలో మహంకాళి - ఆర్తజన సర్వరక్షకి వైభవం (అష్టాదశ శక్తిపీఠాలలో 9వది)

ఉజ్జయినిలో మహంకాళి - ఆర్తజన సర్వరక్షకి వైభవం 

(అష్టాదశ శక్తిపీఠాలలో 9వది) 

 

ఉజ్జయిని 5000 సంవత్సరాల పురాతనమైన మరియు చారిత్రాత్మక నగరం. దీనిని ఆది బ్రహ్మ పురాణంలో అత్యుత్తమ నగరంగా వర్ణించారు మరియు దీనిని అగ్నిపురాణం మరియు గరుడ పురాణంలో మోక్షద మరియు భుక్తి-ముక్తి అని పిలుస్తారు. ఈ నగరం ఒక పెద్ద సామ్రాజ్యానికి రాజధానిగా ఉన్న కాలం ఉంది. ఈ నగరానికి అద్భుతమైన చరిత్ర ఉంది. మత గ్రంథాల ప్రకారం ఈ నగరం ఎప్పుడూ విధ్వంసం చూడలేదు ఎందుకంటే విధ్వంసానికి దేవుడైన మహాకాళుడు ఇక్కడ నివసిస్తున్నాడు. గరుడ పురాణం ప్రకారం మోక్షాన్ని అందించగల ఏడు నగరాలు ఉన్నాయి మరియు వాటిలో అవంతిక నగరం ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఉజ్జయిని ప్రాముఖ్యత ఇతర నగరాల కంటే కొంచెం ఎక్కువ.

:స్థలపురాణం:

అయోధ్యా మధుర, మాయా, కాశీ కాంచీ అవంతిక |

పూరీ, ద్వారవతిచేవ్ సప్తేతః: మోక్షదాయిక: ||

ఈ నగరంలో 12 జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగం, ఏడు మోక్షాన్ని అందించే నగరాలలో ఒక నగరం, గధ్కాలిక మరియు హర్సిద్ధి, రెండు శక్తి పీఠాలు మరియు భారతదేశంలోని నాలుగు నగరాలలో జరిగే పవిత్ర కుంభమేళా ఉన్నాయి. ఇక్కడ రాజు బర్తృహరి  గుహ కనుగొనబడింది మరియు ఉజ్జయినిలో విష్ణువు పాదముద్రలు ఉన్నాయని నమ్ముతారు. “విష్ణవ్: పదంవంటిక ”

శ్లో|| అవంతికాయాం విహితావతారం ముక్తిప్రదానాయ చ సజ్జనానాం

అకాల మృత్యోః పరిరక్షణార్థం వందే మహాకాల మహాసురేశమ్‌ ॥

అకాల మృత్యువు నుండి రక్షించి సజ్జనులకు ముక్తినిచ్చుటకు అవంతీ నగరము  అవతరించిన మహాకాలుడను పేరు గల దేవదేవునకు నమస్కరిస్తున్నాను. (ఇక్కడి అమ్మవారు మహాకాళి) ఇది అష్టాదశ శక్తిపీఠాలలో 9 వది. సతీదేవి మోచేయిపడిన చోటు.

ఉజ్జయిని శక్తిపీఠ మహాకాళి ఆలయం, మధ్యప్రదేశ్‌ లోని ఉజ్జయిని నగరంలో ఉంది. ఈ ఆలయం దేవి మహంకాళికి అంకితం చేయబడింది. ఇది సతీదేవి మోచేయి పడిన ప్రదేశం. అష్టాదశ శక్తి పీఠాలలో ఇది తొమ్మిదవ శక్తిపీఠం. ఉజ్జయిన నగరం ద్వాదశ జ్వోతిర్లింగాలలో తొమ్మిదోది. ఉజ్జయిని నగరానికి అవంతీ అనే మరో పేరు ఉంది.కాళికాదేవి మాత గర్బాలయంలో ఎంతో ప్రకాశవంతంగా నాలుకను బయటపెట్టి కోపాగ్ని రూపంతో భయంకరంగా దర్శనమిస్తుంది. కాళికామాత నల్లని కళ్లు, సింధూర రంగుతో, చంద్రవంక కిరీటం ధరించి భక్తులు పూజలందు కుంటుంది.

ఆలయంలో, మహాలక్ష్మి సరస్వతి విగ్రహాల మధ్య మహాకాళి విగ్రహం దర్శనమిస్తుంది. ఇంకా ఈ ఆలయంలో స్థిరమన్ గణేష్ ఆలయం గర్హ్కాళి ఆలయాలు ఉన్నాయి. హనుమత్కేశ్వర్ శివలింగం గర్హ్కాళి ఆలయానికి సమీపంలో ఉంది. సింహేశ్వర శివలింగం స్థిర్మాన్ గణేష్ ఆలయంలో ఉంది. మహా కాళి (హర సిద్ధి మాత) గొప్ప రాజైన విక్రమాదిత్యుని ఆరాధనా దేవి. విక్రమాదిత్య రాజు తన తలను 11 సార్లు కోసి తన శిరస్సును దేవికి సమర్పించాడని, ఆ సమయాలన్నింటికీ దేవి దానిని తిరిగి జోడించి జీవించేలా చేసిందని చెబుతారు. అతని చిత్రపటం ఈ ఆలయం లోని ఒక వరండాలో ఉంది. ఆలయంలో ప్రతిరోజూ సాయంత్రం 15 అడుగుల ఎత్తులో వెలిగించే రెండు ప్రత్యేకమైన దేవదారు వృక్షం ఆకారపు ఇనుప దీపాల స్తంభాలు ఉన్నాయి. హరసిద్షి మాత ఆలయంలో, అన్నపూర్ణ దేవి, సరస్వతీ దేవి విగ్రహాలు ప్రతిష్టించబడ్డాయి.

:పూర్వ కధ:

ఉజ్జయినిలో కాళికాదేవి ఆలయం గఢకాలికా శక్తి పీఠం మరొకటి ఉంది. ఒక పురాణం ప్రకారం, నిరక్షరాస్యుడు, మూర్ఖుడైన కాళిదాసు కాళికా దేవిని ఆరాధించాడు కాళిదాసుకు గఢకాలికగా అమ్మవారు దర్శనమిచ్చి జ్ఞానాన్ని ప్రసాదించిన క్షేత్రం గఢకాలికా మందిరము. కాళికా దేవి అతని భక్తికి ముగ్ధురాలైంది. అతనికి సాహిత్య నైపుణ్యాలను అనుగ్రహించింది. మహాకవి కాళిదాసు ఈ కాళిని ఆరాధించియే మహాకవి కాళిదాసు గొప్ప కవి అయ్యాడు. గోపాలమందిరం నుండి మార్గమున్నది. ఇది నగరానికి మైలు దూరంలో ఉంది.  కాళీమందిర సమీపంలో స్థిరగణేశ మందిరము, దానికెదురుగా ప్రాచీన హనుమన్మందిరము ఉన్నవి. భర్తృహరి గుహ: మహాకాళీ దేవళమును కుత్తరంగా రెండు ఫర్లాంగుల దూరంలో భర్తృహరి గుహ, అతని సమాధి ఉన్నాయి. ఒక సందులో నుండి గుహలోకి ప్రవేశించవలసి యుండును. కాలభైరవ క్షేత్రము: నగరం నుండి మూడు మైళ్ళ దూరంలో శిప్రానది యొడ్డున దిబ్బపై కాలభైరవాలయమున్నది. సాందీపుని ఆశ్రమం:  శ్రీకృష్ణుడు కుచేలుడు కలసి సాందీప మహర్షి ఆశ్రమంలో విద్యాభ్యాసము చేసిన ప్రదేశాన్ని ఉజ్జయినీలో దర్శించవచ్చు. గోపాలమందిరము నుండి రెండు మైళ్ళ దూరంలో మంగళనాధ క్షేత్రమునకు వెళ్ళు త్రోవలో ఉన్నది. మంగళనాధ క్షేత్రం: అంకపదము (సాందీపుని ఆశ్రమము) నకావల దిబ్బపై మంగళ నాధ మందిరమున్నది. భూదేవి కుమారుడైన  (కుజుడు) ఇక్కడే జన్మించాడని పురాణాలు చెప్తున్నాయి. నక్షత్ర వేధశాల (యంత్ర మహల్‌): ఇది శిప్రానది దక్షిణ తీరమున ఇప్పుడు జీర్ణావస్థలో ఉంది. అందలి యంత్రములు నేటికినీ కొన్ని ఉపయోగిస్తాయి.స్కంద పురాణ ప్రకారం ఇచట మరణించిన వారికి తిరిగి జన్మముండదు కావున ఇది ఊషరక్షేత్రమని, పాపాలను నశింపజేస్తుంది కావున క్షేత్రమనీ, మహాశ్శశానమనీ, మహాకాళవనమనీ, మోక్షప్రదమైనదని పేర్కొంటారు ఉజ్జయిని.

*********-----************

డా|| ఈడ్పుగంటి పద్మజారాణి / Dr Edupuganti Padmaja Rani

జ్యోతిష్యము & వాస్తు నిపుణురాలు / Astrology & Vaastu Consultant

email : padma.suryapaper@gmail.com

www.padmamukhi.com