శ్రీశైలంలో ముగిసిన గణపతి నవ రాత్రోత్సవాలు
వినాయక చవితిని పురస్కరించుకొని లోక కల్యాణం కోసం 9 రోజులపాటు శ్రీశైలంలో నిర్వహించిన గణపతి నవరాత్రోత్సవాలు బుధవారంతో ముగిశాయి. సాక్షి గణపతి ఆలయం ప్రాంగణంలో ఈనెల 14వ తేదీ నుంచి మట్టి గణపతిని నెలకొల్పి ప్రత్యేక పూజలు జరిపించారు. ఉత్సవాల ముగింపు పూజా కార్యక్రమంలో భాగంగా పూర్ణాహుతి, అవబృథ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు, పలువురు ట్రస్ట్ బోర్డు సభ్యులు, అధికారులు, అర్చక స్వాములు తదితరులు పాల్గొన్నారు.