BREAKING
డార్లింగ్ పుట్టినరోజున ‘స్పిరిట్’ నుంచి అదిరిపోయే ట్రీట్: సాలిడ్ యాక్షన్ గ్లింప్స్‌కు రంగం సిద్ధం! కొండగట్టు అంజన్నను దర్శించుకున్న హైడ్రా కమీషనర్ “క్షమాపణ చెప్తారనుకున్నా.. డైవర్షన్ చేస్తున్నారు” కెసిఆర్ మరణాన్ని కోరడం ఎమ్మెల్యే స్థాయికి తగదు విజయవాడ దుర్గగుడి బోర్డులో సుస్మిత కొణిదెల నియామకం: ఆధ్యాత్మిక వర్గాల్లో జోరుగా చర్చ! ఖబర్ధార్ శంకర్.! రాష్ట్రానికి పట్టిన పీడ కేసీఆర్ ప్రతిరోజూ ప్రోటీన్ కావాలా? ఈ ఆహారాలను మీ డైట్‌లో చేర్చుకోండి! వేములవాడలో అఖండ భక్తజనం.. దేవాలయ చరిత్రలో ఘననీయమైన ఆదాయం.. శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకున్న 1,05,600 మంది భక్తులు.. రోజూ ఎంతసేపు నడిస్తే ఆరోగ్యానికి మంచిది? ఆయుర్దాయం పెంచే అద్భుతమైన మార్గం! ‘అరసన్’ సినిమాపై శింబు ఆసక్తికర వ్యాఖ్యలు: అంచనాలు పెంచేస్తున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా! దళిత నాయకున్ని అవమానిస్తే చూస్తూ ఊరుకోము:.... రణరంగాన్ని తలపించిన పటాన్‌చెరు -కాంగ్రెస్‌ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌ పోటాపోటీ ధర్నాలు సత్య నికేతన్ భవన కూల్చివేత దుర్ఘటన అసెంబ్లీలో గుండెపోటుతో పడిపోయిన ఐఏఎస్ అధికారి పీఎస్‌కు మంత్రి వకిటి శ్రీహరి సీపీఆర్

డార్లింగ్ పుట్టినరోజున ‘స్పిరిట్’ నుంచి అదిరిపోయే ట్రీట్: సాలిడ్ యాక్షన్ గ్లింప్స్‌కు రంగం సిద్ధం!

Select Suryaa Now
డార్లింగ్ పుట్టినరోజున ‘స్పిరిట్’ నుంచి అదిరిపోయే ట్రీట్: సాలిడ్ యాక్షన్ గ్లింప్స్‌కు రంగం సిద్ధం!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రాలలో ‘స్పిరిట్’ ఒకటి. సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై టాలీవుడ్‌లో మాత్రమే కాకుండా జాతీయ స్థాయిలో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ప్రతిసారీ ప్రభాస్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన అభిమానులకు మేకర్స్ అదిరిపోయే సర్‌ప్రైజ్‌లు ఇస్తుండగా, ఈసారి అక్టోబర్ 23న రానున్న బర్త్‌డే కానుకగా మరింత ప్రత్యేకమైన అప్‌డేట్ ఇవ్వడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

గత సినిమాల మాదిరిగా కేవలం చిన్నపాటి ఆడియో లేదా పోస్టర్‌తో సరిపెట్టకుండా, ఈసారి ప్రభాస్ క్యారెక్టర్ ఇంట్రోను తలపించేలా ఒక పవర్‌ఫుల్ యాక్షన్ గ్లింప్స్‌ను విడుదల చేసే యోచనలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఉన్నట్లు ఫిలింనగర్ వర్గాల ద్వారా సమాచారం వెలువడింది. ఈ గ్లింప్స్ సినిమా స్థాయిని పూర్తిగా మార్చేసేలా ఉంటుందని, అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో ఇది రూపుదిద్దుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ఇదిలాఉంటే, ప్రభాస్ నటిస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘ఫౌజీ’ నుంచి కూడా అదే రోజున ప్రత్యేకమైన అప్‌డేట్ వచ్చే ఛాన్స్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. వరుసపెట్టి క్రేజీ ప్రాజెక్ట్‌లతో బాక్సాఫీస్ వద్ద హవా నడిపిస్తున్న డార్లింగ్ బర్త్‌డే వేడుకలను ఈసారూ భారీ స్థాయిలో నిర్వహించడానికి ఫ్యాన్స్ ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించారు. రాబోయే అప్‌డేట్‌లు సోషల్ మీడియాలో రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.