BREAKING
తెరపై ఆయన విగ్రహం కనిపిస్తే చాలు.. ఎస్వీఆర్ నటనా వైదుష్యంపై ఎల్.వి. ప్రసాద్ చెప్పిన అద్భుత పాఠం! బత్తాయి తోటలను పరిశీలించిన డాక్టర్ మల్లికార్జున రెడ్డి నాగ చైతన్య చేతుల మీదుగా 'ది రేజ్ ఆఫ్ వారాహి' సాంగ్ లాంచ్: సెప్టెంబర్ 11న 'మహేంద్రగిరి వారాహి' గ్రాండ్ రిలీజ్! థియేటర్ల పరిరక్షణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు: ఐదేళ్ల కాలపరిమితితో సింగిల్ విండో లైసెన్స్‌లు - ఏపీఎఫ్‌డీసీ చైర్మన్ భరత్ భూషణ్! 'టార్టాయిస్' ఒక యూనిక్ థ్రిల్లర్ మూవీ, థియేటర్స్‌లో కంప్లీట్ ఎంగేజ్‌మెంట్: హీరో రాజ్ తరుణ్! విద్యార్థుల, యువత సదస్సు స్థలాన్ని పరిశీలించిన గంగుల కమలాకర్ ఆ రెండు ప్యానెల్స్ చేయలేని పనులు నేను చేసి చూపిస్తా... లేకుంటే రాజీనామా చేస్తా: నిర్మాత నట్టి కుమార్ సంచలన ప్రకటన! దీపావళి తర్వాత పెళ్లి పీటలెక్కనున్న అనిరుధ్ - కావ్య మారన్? విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్! 'డెలులు' టీజర్ లాంచ్: చిరంజీవి వాట్సాప్ స్టేటస్ నా జీవితాన్ని మార్చేసింది - హీరో విజయ్ రాజ్‌కుమార్! కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా 'చకోర' టీజర్ రిలీజ్: అక్టోబర్ 8న గ్రాండ్ థియేటర్స్‌లోకి లవ్ బర్డ్స్! Jailer 2: వాయిదా వార్తలకు పటాపంచలు.. పక్కా ప్లాన్‌తోనే రజినీకాంత్ 'జైలర్ 2' వేట! అనన్య నాగళ్ల ‘లీసా’ షూటింగ్ పూర్తి: నవంబర్‌లో గ్రాండ్ రిలీజ్‌కు సన్నాహాలు! బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ రివ్యూ: ఏజ్‌ గ్యాప్‌ లవ్‌స్టోరీ ఎలా ఉందంటే? మెగాస్టార్ చిరంజీవి 'కాకా' మూవీ: సెప్టెంబర్ 7 నుంచి హైదరాబాద్‌లో భారీ షెడ్యూల్ షురూ! వేణు ఊడుగుల సమర్పణలో 'చంద్రయాన్' మోషన్ పోస్టర్ రిలీజ్: సొంతంగా రాకెట్ తయారు చేసిన ముగ్గురు కుర్రాళ్ల సాహస యాత్ర!

'టార్టాయిస్' ఒక యూనిక్ థ్రిల్లర్ మూవీ, థియేటర్స్‌లో కంప్లీట్ ఎంగేజ్‌మెంట్: హీరో రాజ్ తరుణ్!

Select Suryaa Now
'టార్టాయిస్' ఒక యూనిక్ థ్రిల్లర్ మూవీ, థియేటర్స్‌లో కంప్లీట్ ఎంగేజ్‌మెంట్: హీరో రాజ్ తరుణ్!

టాలీవుడ్‌లో వైవిధ్యమైన కథలతో దూసుకుపోతున్న యువ హీరో రాజ్ తరుణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘టార్టాయిస్’ (Tortoise). ఈ చిత్రంలో అమృత చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రముఖ నటులు అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎస్ కే గోల్డెన్ ఆర్ట్స్, ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎన్ వీ ఎల్ క్రియేషన్స్ బ్యానర్లపై విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సస్పెన్స్, డ్రామా మేళవింపుతో కూడిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా దర్శకుడు రిత్విక్ కుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఇదిలా ఉంటే, తాజాగా ఈ సినిమాలోని 'నీ పరిచయం...' అంటూ సాగే మెలోడియస్ పాటను హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్‌తో పాటు ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ తదితరులు హాజరై సందడి చేశారు.

ఈ సందర్భంగా హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ... "'టార్టాయిస్' అనేది ఒక యూనిక్ థ్రిల్లర్ మూవీ. థియేటర్స్‌లో ప్రేక్షకులను ఇది పూర్తిగా ఎంగేజ్ చేస్తుంది. ప్రతీ సీన్ ఉత్కంఠభరితంగా సాగుతుంది" అని తెలిపారు.

ఈ పాట విశేషాల గురించి ప్రముఖ లిరిసిస్ట్ చంద్రబోస్ మాట్లాడుతూ... ప్రేమ, ఆర్తి, అక్కెరతో కూడుకున్న ఈ పాటను అనూప్ రూబెన్స్ అత్యద్భుతంగా కంపోజ్ చేయగా, చిన్మయి తన మధురమైన గొంతుతో ప్రాణం పోశారని ప్రశంసించారు. ఈ చిత్రం ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుందనే నమ్మకం తనకుందని ఆయన అన్నారు.

నిర్మాతలు విజయ్ చౌదరి, శశిధర్ నల్ల మాట్లాడుతూ... 'నీ పరిచయం' పాట సినిమాకి ఒక పిల్లర్ లాంటిదని, ఎమోషనల్ టచ్ ఉన్న ఈ ట్రాక్ అందరినీ కట్టిపడేస్తుందని తెలిపారు. దర్శకుడు రిత్విక్ కుమార్ ఎక్కడా రాజీ పడకుండా ప్లాన్ ప్రకారం అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చేశారని, రాజ్ తరుణ్ మరియు అమృత నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని పేర్కొన్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు.