'కింగ్': 'తు మిల్ జాయే' సాంగ్‌లో 'ఓం శాంతి ఓం' ఛాయలు.
షారుఖ్ ఖాన్, దీపికా పడుకోణ్ జంటగా నటిస్తున్న చిత్రం 'కింగ్' (King) లోని మొదటి పాట 'తు మిల్ జాయే' (Tu Mil Jaaye) ఇటీవల విడుదలై ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది.
విజువల్స్‌లో షారుఖ్, దీపికా వైన్ గ్లాసెస్ పట్టుకుని ఉన్న విందు సన్నివేశం 'ఓం శాంతి ఓం' లోని రొమాంటిక్ సీన్స్‌ను గుర్తుకు తెస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అలాగే షారుఖ్ వెనక నిలబడి దీపికను ప్రేమగా చూసే షాట్స్ కూడా వారి మొదటి సినిమా జ్ఞాపకాలను మళ్లీ తెప్పించాయని పేర్కొంటున్నారు. దీన్ని అభిమానులు 'ఓం అండ్ శాంతి రీయూనియన్' అని సంబరంగా పిలుచుకుంటున్నారు.
అంతేకాకుండా, పాటలోని ఒక ఫైర్ (అగ్ని ప్రమాదం) సీన్ చూస్తుంటే.. ఈ సినిమాలో కూడా 'ఓం శాంతి ఓం' తరహాలోనే ఒక విషాదభరితమైన ప్రేమకథ ఉండవచ్చనే అనుమానాలను నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. దీపిక పాత్రకు ఏదైనా ప్రమాదం జరగడం, షారుఖ్ ఆమెను కాపాడలేకపోవడం వంటి కోణాల్లో కథ ఉండవచ్చని సోషల్ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి.
సచిన్-జిగర్ సంగీతం అందించిన ఈ పాటను అరిజిత్ సింగ్ మరియు మధుబంతి బాగ్చి ఆలపించారు.