'సహాయం చేయడానికి దేవుడు ఆటోరిక్షాలో రాడు': మమ్ముట్టి ఆసక్తికర వ్యాఖ్యలు
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి సామాజిక బాధ్యత మరియు జీవకారుణ్య సేవలపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఇతరులకు సహాయం చేయడం అనేది ఒకరి ఆదేశాల వల్ల కాకుండా మనస్ఫూర్తిగా చేయాల్సిన బాధ్యత అని ఆయన ఉద్ఘాటించారు.
పరుమల చర్చిలో జరిగిన సేక్యులర్ కార్యక్రమంలో మమ్ముట్టి తన 'కేర్ అండ్ షేర్ ఫౌండేషన్' ద్వారా పరుమల ఆసుపత్రితో కలిసి 'సారా సాయి - సుకృతం 2.0' అనే ఉచిత క్యాన్సర్ చికిత్స పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ, "దేవుడు చాలా దయామయుడని మనం నమ్ముతాం. కానీ దేవుడు ఏమీ ఆటోరిక్షా ఎక్కి వచ్చి ప్రతీ ఒక్కరికీ నేరుగా సహాయం చేయడు. దయ కలిగిన మనుషులను సృష్టించి, ఒకరికొకరు సహాయపడమని సందేశాన్ని ఇస్తాడు. అలా తోటి మనుషులకు సహాయం చేయడమే నిజమైన దైవభక్తి" అని పేర్కొన్నారు.
ఈ ఉచిత క్యాన్సర్ చికిత్స పథకం ద్వారా కనీసం 25 మందికి ఉచిత చికిత్సను అందిస్తున్నారు. మమ్ముట్టి కేవలం నటుడిగానే కాకుండా, ఇటువంటి సేవా కార్యక్రమాల ద్వారా ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.