DNK మూవీ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్.. థియేటర్లలో ప్రేక్షకులు హాయిగా నవ్వుకుంటారు: హీరో మౌళి తనూజ్ ప్రశాంత్
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో తెరకెక్కుతున్న క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్ 'DNK' సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మౌళి తనూజ్ ప్రశాంత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీను కంబాల దర్శకత్వం వహిస్తుండగా, నవంబర్ 13న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా విశేషాలను పంచుకుంటూ హీరో మౌళి తనూజ్ ప్రశాంత్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను, తన పాత్ర అనుభవాలను ఆయన మీడియాతో పంచుకున్నారు.
ఈ చిత్రానికి మొదట అనుకున్న టైటిల్‌కు సెన్సార్ పరంగా అవాంతరాలు ఎదురుకావడంతో 'DNK'గా మార్చాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. అయితే ఈ కథ విన్నప్పుడే తనకు ఎంతో నచ్చిందని, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా సాగుతుందని ఆయన పేర్కొన్నారు. ఇందులో క్రైమ్ ఎలిమెంట్ ఉన్నప్పటికీ అది పూర్తిగా ఫన్‌తో కూడుకుని ఉంటుందని, థియేటర్లలో ప్రేక్షకులు కుటుంబ సమేతంగా వచ్చి హాయిగా నవ్వుకునేలా ఈ సినిమా ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన టూర్‌లో ప్రేక్షకులనుంచి అద్భుతమైన స్పందన లభించిందని తెలిపారు.
ఈ చిత్రంలో ఒక కుర్రాడు ఈజీ మనీకి అలవాటు పడి గ్యాంబ్లింగ్ ద్వారా అప్పుల్లో కూరుకుపోవడం, ఆ తర్వాత ఆ అప్పుల నుంచి బయటపడటానికి ఒక దొంగతనం చేయడం వంటి ఆసక్తికరమైన మలుపులతో కథ నడుస్తుందని మౌళి తెలిపారు. వైజాగ్ నేపథ్యంలో సాగే ఈ కథలో ప్రముఖ నటుడు ఆలీతో పనిచేయడం అద్భుతమైన అనుభవమని, ఆయన పాత్ర సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని కొనియాడారు. సింజిత్ అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయని, అలాగే చిత్రంలో తాను తొలిసారిగా చేసిన డాన్స్ నంబర్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుందని ఆయన వెల్లడించారు. మైత్రీ మూవీ మేకర్స్ సహకారంతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధిస్తుందన్న పూర్తి నమ్మకంతో ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు.