BREAKING
ఎస్ఎంసి ఎన్నికల ప్రశాంతం... ఫైనాన్షియల్ సెక్టార్‌లో పెరుగుతున్న ఏఐ సైబర్ ముప్పు! కష్టకాలంలో పేదలకు కొండంత అండగా కూటమి ప్రభుత్వం: ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి గార మండలంలో ఘనంగా అంగన్వాడీ ఉత్సవాలు... గూనపాలెం సెక్టార్‌లో ఘనంగా జాతీయ పోషణ మాసం వజ్రపుకొత్తూరులో ఎస్‌ఎంసీ చైర్మన్లు ఏకగ్రీవం. గూగుల్, ఎన్విడియా ఉత్పత్తులపై పడనున్న తీవ్ర ప్రభావం! గిరిజన అభివృద్ధికి సమన్వయ కృషి అవసరం అధ్వానంగా వాడ్రేవుపల్లి – చాకలిపాలెం ప్రధాన రహదారి: భారీ గుంతలతో వాహనదారులకు నిత్యం ప్రమాదాల ముప్పు గిరిజన సమస్యలు స్థానికంగానే పరిష్కారం కావాలి. యుఎస్ వ్యాప్తంగా నిలిచిపోయిన స్పాటిఫై మ్యూజిక్ స్ట్రీమింగ్ నరసన్నపేటలో ఆగని ఆక్రమణలు! క్యూఆర్ కోడ్ స్కానింగ్ సమస్యలపై డీలర్లతో డీఎస్‌ఓ సమావేశం మాజీ ఎంపీపీలు, జెడ్పీటీసీలకు వైఎస్సార్‌సీపీ సన్మానం.. వరి పంట పొలాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు..

వికసిత పొదిలి పట్టణంగా తీర్చిదిటమే మా లక్ష్యం

Select Suryaa Now
వికసిత పొదిలి పట్టణంగా తీర్చిదిటమే మా లక్ష్యం

 - మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు 


*రాజకీయం కొసం “పొదిలి” ని అణగదొక్కిన పాపం గతపాలకులదే..
*ఐదుసంవత్సారాలు అధికారాన్ని అనుభవించి స్వార్థ రాజకీయాలు చేశారు...
*అమృత్ 2 కింద రూ.169 కోట్లతో ఇంటింటికి పైప్ లైన్
*పొదిలికి మంజూరైన HAM కింది రూ.20 కోట్లతో సిసి రోడ్లు ఏర్పాటు

సూర్య ప్రతినిధి, ఒంగోలు : 

రాజకీయం కోసం పొదిలి నగర పంచాయతీని గత పాలకులు అణగదొక్కారని మార్కాపురం ఎమ్మెల్యే శ్రీ కందుల నారాయణరెడ్డి గారు వైసీపీ నేతల పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం పొదిలి నగర పంచాయతీలో పొదిలికి హెచ్ ఎఎం కింద   మంజురైన రూ.20 కోట్లతో వేసే రోడ్లు,  సంబంధించి  కాటూరివారిపాలెం, రాజుపాలెం, బాప్టిస్ట్ పాలెం, టైలర్స్ కాలనీ, రామ్‌నగర్, బుచ్చెనపాలెం ఎస్సీ పాలెంలో పలు సీసీ రోడ్లకు కl ఆయన శుంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన పొదిలి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన పొదిలి ప్రెస్‌క్లబ్‌కు ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు హాజరయ్యారు. అనంతరం ఆయన ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి గారు పొదిలి పట్టణం పట్ల గత వైసీపీ నాయకుల పనితీరు పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గడిచిన ఐదు సంవత్సరాల్లో వైసీపీ నాయకులు రాజకీయం కోసం పొదిలిని తీవ్రంగా అణగదొక్కారన్నారు. కానీ కూటమి ప్రభుత్వం ఈ ప్రజలకు, ఈ పొదిలి ప్రాంతానికి మంచి జరగాలని అనే ఉద్ధేశ్యంతో ఈ ప్రాంత ప్రజలకు ఫ్లోరిన్ సమస్య లేకుండా శాశ్వతంగా తొలగించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు భారీగా నిధులు కేటాయించారన్నారు. ఆయనకు పొదిలి ప్రజల తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. గత పాలకులు పెద్దచెరువుకు నీరు ఇస్తామని చెప్పి రూ.50 కోట్లు కేటాయించామని చెప్పి శంకుస్థాపనలు చేసి టపాసులు కాల్చుకున్నారన్నారు. కానీ కాంట్రాక్టర్లకు, అప్పటి  నాయకుల మధ్య ఏం జరిగిందో తమకు తెలయదన్నారు. కానీ ఫైనాన్స్ అలకేషన్ లేకుండా మీకే టెండరు ఇస్తామని చెప్పి పనులు చేయించారన్నారు. పాపం అమాయక ప్రజలందరూ వైస్సార్సీపీ పార్టీ నాయకులు పెద్ద చెరువుకు నీరు తీసుకువస్తారని నమ్మారన్నారు. తీరా వాస్తవాలను పరిశీలిస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తాను వ్యక్తిగతంగా పరిశీలించి రూ.50 కోట్లకు ఫైనాన్స్ అలకేషన్ తీసుకువచ్చి పనులు చేయిస్తున్నామన్నారు. అంతటితో ఆగకుండా పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు నిధులు కూడా విడుదల చేయించి ఇప్పించామన్నారు. పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. సాగర్  జలాలపై ఆధారపడిన ఈ ప్రాంతంలో సాగర్ అక్రమ కనెక్షన్లు పెట్టుకుని నిజమైన పేద వాడికి నీరు రాకుండా చేస్తున్నారన్నారు. ప్రతి ఒక్క కుటుంబానికి తాగునీరు అందించాలనే ధృడ నిశ్చయంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో పలు దఫాలు చర్చించి అమృత్ 2 క్రింద 169 కొట్లతో 100 సంవత్సరాలకు నీటి ఎద్దడి లేకుండా చేస్తున్నామని తెలిపారు. అందుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ కూడా ముగిసిపోయిందన్నారు. త్వరలనో పనులకు శంకుస్థాపన కూడా చేయించడం జరుగుతుందన్నారు. ప్రజలు ఎవ్వరు కష్టాపడుతున్నారో ఎవ్వరు అభివృద్ధికి పట్టంకడుతున్నారో గమనించాలన్నారు. ప్రజలు స్వార్థ రాజకీయ నాయకుల మాటలు నమ్మకుండా ప్రజా ప్రభుత్వాన్ని విశ్వసించి రాబోవు మున్సిపల్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను  గెలిపించి పొదిలి పట్టణ అభివృద్ధికి సహకరించాలని ఆయన కొరారు. పొదిలి ప్రెస్ క్లబ్ సొంత భవనానికి వారం రోజుల్లో స్థల కేటాయింపు చేయిస్తానని, జర్నలిస్టు మిత్రులందరికీ ఇళ్ళ స్థలాలు కూడా త్వరలోనే అందజేస్తామని హామీ ఇచ్చారు. మీడియా సమావేశం ముగిసిన అనంతరం ప్రెస్‌క్లబ్ నూతన కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి గారి కి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు..
ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం నాయకులు, ఆయా వార్డ్ తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.