విద్యార్థినులకు ఇంటర్న్‌షిప్ శిక్షణపై అవగాహన
అరకులోయ, నవంబర్ 28, మేజర్ న్యూస్:
స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్.కుసుమకుమారి ఆదేశాల మేరకు గాజువాకకు చెందిన డేటాప్రో కంప్యూటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు విద్యార్థినులకు ఇంటర్న్‌షిప్ శిక్షణపై శనివారం అవగాహన కల్పించారు.ఇంటర్న్ షిప్ పై విద్యార్థినులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి చైతన్య ఫలితాలు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్.కుసుమకుమారి మాట్లాడుతూ విద్యార్థినులు చదువుతో పాటు ఉద్యోగ అవకాశాలకు ఉపయోగపడే నైపుణ్యాలను కూడా అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.ఇటువంటి ఇంటర్న్‌షిప్ కార్యక్రమాలు విద్యార్థినుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు భవిష్యత్తులో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఎంతో దోహదపడతాయని ఆమె తెలిపారు.ఈ సందర్భంగా సంస్థ సెంటర్ మేనేజర్ ఎన్.బి.వి.ప్రసాద్ మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో డిగ్రీ విద్యతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం,సాంకేతిక నైపుణ్యాలు కలిగి ఉండటం ఎంతో అవసరమని తెలిపారు.విద్యార్థినులకు ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడంతో పాటు ఆచరణాత్మక పరిజ్ఞానాన్ని అందించాలనే ఉద్దేశంతో తమ సంస్థ మూడు నెలల పాటు ఇంటర్న్‌షిప్ శిక్షణ అందించనున్నట్లు ఆయన వివరించారు.అనంతరం ఇంటర్నేషిప్ కోఆర్డినేటర్ జి. అనిల్ కుమార్ మాట్లాడుతూ ఈ శిక్షణ ద్వారా విద్యార్థినులు వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవడంతో పాటు ఉద్యోగ రంగానికి అవసరమైన అనుభవాన్ని పొందవచ్చునని చెప్పారు. 105 మంది విద్యార్థినులను మూడు బ్యాచ్‌లుగా విభజించి గాజువాకలోని డేటాప్రో కంప్యూటర్స్ సంస్థలో మూడు నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.శిక్షణ కాలంలో విద్యార్థినులకు వసతి సౌకర్యంతో పాటు స్టైఫండ్ కూడా అందించనున్నట్లు ఆయన వెల్లడించారు.సంస్థ కల్పిస్తున్న ఈ అవకాశాన్ని విద్యార్థినులు సద్వినియోగం చేసుకొని తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల కోఆర్డినేటర్ కె.శశి కుమార్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.