తుపాన్ ప్రభావంతో తగ్గిన వరి దిగుబడులు
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంమండలంలోని విలాస గంగవరం,యండగండి గ్రామాల్లో మంగళవారం వరి పంట కోత ప్రయోగాలు నిర్వహించినట్లు మండల వ్యవసాయ అధికారి సద్గురుమూర్తి తెలిపారు.ఆర్నాబ్,ముసురు తుఫాన్ల ప్రభావంతో వరి దిగుబడి గణనీయంగా తగ్గినట్లు పేర్కొన్నారు.ఎకరాకు 9 నుంచి 11 బస్తాల దిగుబడి మాత్రమే నమోదైనట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు దుర్గాభవాని,శ్రీలక్ష్మి,బీమా ఏజెంట్ టీ.రవీంద్ర,రైతులు పాల్గొన్నారు.