BREAKING
రైతులకు పంటల మార్పిడిపై అవగాహన కల్పించడమే లక్ష్యం ఇర్లపాడు సెగ్మెంట్లో వైసీపీ ముమ్మర ప్రచారం శివశంకర్ కాలనీలో వైసిపి గర్భ గర్వపు ప్రచారం సర్వేపల్లి రిజర్వాయర్‌లో 3.18 లక్షల చేప పిల్లల విడుదల రైతులకు 100% రాయితీపై పొద్దుతిరుగుడు విత్తనాల పంపిణీ ఏపీలో మున్సిపల్ ఎన్నికలు.. 3 రోజులు మద్యం షాపులు బంద్! స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థులను గెలిపించండి: జిల్లా కార్యదర్శి అరిగెల సాయి పిలుపు ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీ.. చైనాపై ఘన విజయం సాధించిన భారత జట్టు! కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై దేశవ్యాప్త ఆందోళనలు: సీపీఐ రాష్ట్ర నేత జంగాల అజయ్ కుమార్ పొన్నూరులో వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహావిష్కరణలో పాల్గొన్న......... ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ ఎన్నికల విధుల పర్యవేక్షణలో లోపాలు సహించేది లేదు : జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి కూటమితోనే సంక్షేమాభివృద్ధి 40వ వార్డులో కార్పొరేటర్ గుణశేఖర్ సుడిగాలి పర్యటన - చివరి రోజు గ్రూలింగ్స్ పేట - ఎంజీఆర్ వీధిలో విస్తృత ప్రచారం - మేయర్ గా హేమలతకు మద్దతు కూటమి అభ్యర్థుల గెలుపుతోనే అభివృద్ధి సాధ్యం గ్రామాల్లోని ప్రజలకు హోమియోవైద్యముపై అవగాహన కల్పిస్తున్న హోమియోవైద్యులు కరుణాకర్

ట్రిపుల్ ఇంజిన్ సర్కార్‌తో నియోజకవర్గంలో మరింత అభివృద్ధి..: ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.

Select Suryaa Now
ట్రిపుల్ ఇంజిన్ సర్కార్‌తో నియోజకవర్గంలో మరింత అభివృద్ధి..: ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.

 అనపర్తి మేజర్ న్యూస్. కేంద్రంలో, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్‌గా ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి పాలన అందిస్తోందని, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తే ట్రిపుల్ ఇంజిన్ సర్కార్‌తో నియోజకవర్గంలో మరింత వేగంగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం ఉంటుందని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అర్ణబ్ తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించేందుకు అనపర్తి నియోజకవర్గంలో పర్యటించిన ఎంపీ పురందేశ్వరి ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రాధాన్యతను వివరించారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రాన్ని సంక్షేమం, అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తున్నారని పేర్కొన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, స్థానిక సంస్థల్లోనూ కూటమి బలపడితే గ్రామస్థాయిలో ప్రజలకు మరిన్ని అభివృద్ధి ఫలాలు అందించేందుకు వీలవుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో అనపర్తి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు కూటమి తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులను ప్రజలు ఆదరించి గెలిపించాలని ఎంపీ కోరారు.ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. స్థానిక సంస్థల్లో కూటమి అభ్యర్థుల విజయంతో గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలుకు మరింత సమన్వయంతో పనిచేసే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.ప్రజలు అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతుగా నిలవాలని వారు విజ్ఞప్తి చేశారు.