BREAKING
UNSC శాశ్వత సభ్యత్వానికి భారత్‌ కంటే బలమైన అర్హత ఏ దేశానికీ లేదు: ప్రముఖ అమెరికన్ ఆర్థికవేత్త జెఫ్రీ సాచ్స్ ​గోవా కోర్టులో లొంగిపోయిన ‘తెహెల్కా’ మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ ​పనాజీ: ఉమ్మడి జిల్లా ప్రజలకు, కార్యకర్తలకు వినాయక చవితి శుభాకాంక్షలు మంత్రి దామోదర్ రాజనర్సింహ ఎల్లంపేట మున్సిపల్ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు విఘ్నేశ్వరుని తొలి పూజలో శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి మట్టి గణపతి తోనే పర్యావరణ పరిరక్షణ* *జిల్లా కలెక్టర్ బంగ్లాలో వినాయక చవితి పూజలు* వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తిరుమల జి ఎన్ సి టోల్గేట్ వద్ద చిరుత కలకలం కార్గిల్ యుద్ధ వీరుడుపై ఇనుప రాడ్ తో దాడి విఘ్నాలను తొలగించి.. విజయాలను అందించే విఘ్నేశ్వరుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ, పవిత్రమైన "వినాయక చవితి" సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఏఐపీసి చైర్మన్ మధుయాష్కి గౌడ్ ను కలిసిన సర్పంచ్ కుంభం మంజుల సతీష్ గౌడ్ వినాయకుని కృపతో ప్రతి అడుగులో విజయాలు చేకూరాలి కళాకారుల బతుకులతో ఆటలాడుతున్న... కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం-గిలకత్తుల రమెష్ గౌడ్ యాసిడ్ దాడిలో గాయపడిన వివాహిత చికిత్స పొందుతూ మృతి మల్లేనిపల్లి వినాయక చవితి కి రూ. 10,116 విరాళం అందజేసిన టిడిపి నేత చంద్ర * పరిటాల శ్రీరామ్ సూచనలతో ఆర్థిక సాయం

టీడీపీ కార్యకర్త నెట్టెం కేశవ కుటుంబానికి రూ. 5 లక్షల బీమా చెక్కు అందజేసిన పరిటాల శ్రీరామ్

Select Suryaa Now
టీడీపీ కార్యకర్త నెట్టెం కేశవ కుటుంబానికి రూ. 5 లక్షల బీమా చెక్కు అందజేసిన పరిటాల శ్రీరామ్

ధర్మవరం

ధర్మవరం పట్టణ పరిధిలోని శాంతినగర్‌కు చెందిన తెలుగుదేశం పార్టీ క్రియాశీల కార్యకర్త నెట్టెం కేశవ ఇటీవల అకాల మరణం చెందారు. సమాచారం అందుకున్న పార్టీ అధిష్ఠానం, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి అండగా నిలిచింది.

ఇందులో భాగంగా ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ ఈ రోజు కేశవ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ కార్యకర్తల ప్రమాద బీమా పథకం కింద మంజూరైన రూ. 5 లక్షల విలువైన బీమా పరిహార పత్రాన్ని (చెక్) వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ... పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్త కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ కొండంత అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కేశవ మృతి పార్టీకి తీరని లోటని, వారి కుటుంబ బాధ్యతను పార్టీ చూసుకుంటుందని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.