BREAKING
కూటమి అభ్యర్థుల విజయానికి సమన్వయంతో పనిచేస్తాం. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ లలిత కళాపరిషత్ లో డిప్యూటీ మేయర్ టి. స్వాతికి ఘనసత్కారం.. సమాచార హక్కు చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి : రాయపూడి ని పరామర్శించిన మండలి వెంకట్రామ్ అనంతలో సండేస్ ఆన్ సైకిల్ 100వ ఎడిషన్.. భారీగా పాల్గొన్న విద్యార్థులు క్రీడాకారులు భక్తులకు వాటర్ బాటిళ్ల పంపిణీ.. కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలి మనవరాలి పట్టుబట్టడంతో థియేటర్లో రామాయణం చూసిన అమిత్ షా.. సినిమాపై ప్రశంసల వర్షం రెండో విడతలోనూ టీడీపీ హవా! పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం సద్వినియోగం చేసుకోవాలి దేవునిపల్లి రథోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ విజయరమణ రావు రెండో విడతలోనూ కొనసాగిన తొలివిడత ఒరవడి.. ఘనంగా సూఫీ అభిషిక్తులు.. పుస్తక పఠనం విజ్ఞానానికి ఎంతో మేలు యూనివర్సిటీ వేదికపై అసభ్య ప్రవర్తన.. ప్రముఖ యూట్యూబర్ భువన్ బామ్‌పై కేసు నమోదు

స్థానికం మాదే.. మున్సిపాలిటీ మాదే... ఎమ్మెల్యే " కోండ్రు "

Select Suryaa Now
స్థానికం మాదే.. మున్సిపాలిటీ మాదే... ఎమ్మెల్యే " కోండ్రు "
  • 32 వార్డులతో పాటు, చైర్మన్ పీఠంపై ధీమా
  • రెండో విడత పంచాయతీపోరులో కూటమి విజయకేతనం ఖాయం
  • ప్రజా తీర్పు కూటమికి అనుకూలంగా ఉందన్న ఎమ్మెల్యేలు కోండ్రు, బోనెల విజయచంద్ర
    రాజాం,నవంబర్ 28,మేజర్ న్యూస్ : రాజాం 32 వార్డులతో పాటు మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకోవడం ఖాయమని, రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి విజయ పరంపర కొనసాగుతుందని రాజాం నియోజకవర్గ ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్, నియోజకవర్గ పంచాయతీల పరిశీలకులు, పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ధీమా వ్యక్తం చేశారు.ప్రజల ఆదరణ,పార్టీ శ్రేణుల సమిష్టి కృషి కూటమికి విజయాన్ని అందిస్తాయన్నారు.రాజాం మండలం శ్యాంపురంలోని తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఇరువురు ఎమ్మెల్యేలు మున్సిపల్ ఎన్నికల పరిస్థితులు,కూటమి విజయావకాశాలు, రెండో విడత పంచాయతీ ఎన్నికలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ మాట్లాడుతూ రాజాం మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ అభ్యర్థితో పాటు మొత్తం 32 వార్డుల్లోనూ కూటమి అభ్యర్థులు విజయబావుటా ఎగురవేస్తారని ధీమా వ్యక్తం చేశారు.ఎన్నికల ప్రచారంలో పట్టణ ప్రజల నుంచి లభించిన స్పందన కూటమికి అనుకూలంగా ఉందని,ప్రజల ఆదరణ తమ విజయానికి బలమైన సంకేతమని పేర్కొన్నారు. పట్టణ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమ పథకాల అమలు, పారదర్శక పాలన వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లామని తెలిపారు.ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజాం పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించడమే కూటమి లక్ష్యమని, మున్సిపాలిటీకి కొత్త దిశ,అభివృద్ధికి కొత్త వేగం అందించేందుకు కూటమి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.ఎన్నికల ప్రచారంలో కూటమి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేశారని,ప్రతి వార్డులోనూ ప్రజలతో మమేకమై తమ అభ్యర్థుల విజయానికి కృషి చేశారని అన్నారు. ప్రజా మద్దతుతో మున్సిపాలిటీలో కూటమి సంపూర్ణ ఆధిపత్యం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజా తీర్పు కూటమికి అనుకూలంగా ఉందని, స్థానిక ఎన్నికల్లో ప్రజలు కూటమి అభ్యర్థులకు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.మున్సిపల్ ఎన్నికల్లో విజయంతో పాటు రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి విజయకేతనం ఎగురవేయడం ఖాయమన్నారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ చైర్మన్ అభ్యర్థి భర్త షణ్ముఖ, కోటగిరి నారాయణరావు,మురళీ మాస్టర్ తదితర కూటమి నాయకులు,కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.