BREAKING
శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు. *శాంతియుత వాతావరణంలో దసరా, బతుకమ్మ ఉత్సవాలు జరుపుకోవలి* మధిర రూరల్ ఎస్.ఐ. విశ్వతేజ నాకు మా నాన్న కావాలి... చిన్నారి సమాధానానికి కదిలిన హృదయాలు వేగవరంలో సేవా సంకల్ప అభియాన్‌ మెడికల్ క్యాంపు దుర్గా పూజ వేళ అస్సాం తేయాకు కార్మికులకు శుభవార్త అన్నపూర్ణ దేవి అలంకరణలో అనఘా లక్ష్మీ అమ్మవారు. కుందుర్పి ప్రతినిధి *ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు, తల్లిదండ్రులు* స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చొరవతో సల్బత్తాపూర్, మధ్వాపూర్ గ్రామాల్లో లోఓల్టేజ్ సమస్యకు పరిష్కారం ఎన్నికల వేళ రౌడీషీటర్లకు పోలీసుల హెచ్చరిక! ఉపాధి కూలీలకు స్నాక్స్ పంపిణీ ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ పెద్దపల్లి ఎస్సైగా గుమ్ముల రాజశేఖర్‌ మాజీ కౌన్సిలర్ ఈశ్వర్ రాజు ను పరామర్శించిన ఎమ్మెల్సీ ఒకే రోజు 355 మందికి 1 కోటి 55 లక్షలుసీఎంఆర్ఎఫ్ సాయం. వైద్యానికి ఆర్థిక భరోసా కల్పించిన మంత్రి నిమ్మల విజ్ ఎయిర్ దూకుడు

శాఖల పనితీరులో మెరుగైన గ్రేడ్ సాధించేందుకు లక్ష్యాల మేరకు అధికారులు పనులు పూర్తి చేయాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి*

Select Suryaa Now
శాఖల పనితీరులో మెరుగైన గ్రేడ్ సాధించేందుకు లక్ష్యాల మేరకు అధికారులు పనులు పూర్తి చేయాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి*

శాఖల పనితీరులో మెరుగైన గ్రేడ్ సాధించేందుకు లక్ష్యాల మేరకు అధికారులు పనులు పూర్తి చేయాలి*
*జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి*

కర్నూలు, అక్టోబర్ 13: జిల్లాలో వివిధ శాఖల పనితీరును ప్రతిబింబించే కీలక పనితీరు సూచికలు (KPI) లక్ష్యాల సాధనలో వెనుకబడిన శాఖలు పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి సంబంధిత అధికారులను ఆదేశించారు.మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలో కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ అంశం పై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలకు నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి, పనితీరు సూచికల్లో మెరుగైన గ్రేడ్ సాధించేలా  పనిచేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.. ప్రభుత్వ శాఖలు తమ పనితీరు సూచికలను నిరంతరం సమీక్షించుకోవాలని, ప్రస్తుతం ఉన్న గ్రేడ్ నుంచి మెరుగైన గ్రేడ్‌కు చేరుకునేం దుకు అవసరమైన చర్యలను ప్రణాళికాబ ద్ధంగా అమలు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.. సుంకేశుల ప్రాంతంలో సిద్ధంగా ఉన్న చేప పిల్లలను అనుకూలమైన నీటి వనరుల్లో త్వరితగ తిన విడుదల చేయాలని, చేప పిల్లల ఉత్పత్తి, నిల్వ సామర్థ్యాన్ని పెంపొందిం చేందుకు చర్యలు తీసుకో వాలన్నారు. నీటి లభ్యతకు అనుగుణంగా చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ, సాధ్యమైన మేరకు లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ మత్స్యశాఖ డిడి ని ఆదేశించారు..జిల్లాలో మధుమేహం, అధిక రక్తపోటు రోగుల స్క్రీనింగ్, తదుపరి వైద్య పరీక్షలు, చికిత్సల పురోగతికి సంబంధించి నిర్దేశించిన లక్ష్యాలతో పోలిస్తే స్క్రీనింగ్, ఫాలోఅప్ సేవల్లో ఆశించిన పురోగతి సాధించలేదన్నారు. సంచా ర చికిత్స కార్యక్రమంద్వారా మధుమేహం, రక్తపోటు రోగులకు నిరంతర వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టాలన్నారు. అవసర మైన మందుల లభ్యతను పరిశీలించి, రోగుల ఫాలోఅప్‌ను మెరుగుప రచాలని కలెక్టర్ తెలిపారు. 
గృహ నిర్మాణాలకు సంబంధించిన KPI సూచికల్లో జిల్లాకు మెరుగైన గ్రేడింగ్ సాధించేలా  కృషి చేయాలని కలెక్టర్ హౌసింగ్ పిడి ని ఆదేశించారు. గృహ నిర్మాణాల్లో వెనుకబాటుకు గల కారణాలను గుర్తించి, నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు.. 
సమావేశంలో సిపిఓ భారతి, మత్స్యశాఖ డిడి రంగనాథ్ బాబు, ఏపిఎంఐపి పిడి శ్రీనివాసులు, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం శాఖ అధికారిని రాయిస్ ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.