BREAKING
సచివాలయ ఉద్యోగులపై కూటమి ప్రభుత్వం దాష్టికం : మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఫైర్‌ క్రీడా పోటీల విజేతలను సత్కరించిన గీతం లయోలా డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల దినోత్సవం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విలేకరుల సమావేశం ఒంటి కాలిపై గ్రామ సేవకుల నిరసన.. ప్రపంచ ఆహార భద్రత పై అంతర్జాతీయ సదస్సు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రారంభం... కాంగ్రెస్ కమిటీ జిల్లా అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ కి పార్నపల్లి విద్యార్థిని ఎంపిక మడనూరు గ్రామంలో “పల్లె పండుగ 3.0” పల్లె పండుగకు భారీగా తరలిన ప్రజలు,. జెండా ఊపి బస్సులను ప్రారంభించిన ఎంపి,ఎమ్మెల్యేలు 1 టౌన్‌లో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి {CMRF} సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ* ఉదయగిరి నియోజకవర్గం పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో--చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు కుటుంబాలను పరామర్శించిన పైలెట్ రోహిత్‌రెడ్డి విశ్రాంతికి భరోసా కావాలి.. పెన్షనర్ల మహాధర్నా ఖాన్‌పురా ఉర్దూ పాఠశాలకు నాయకుల అండ

సాగు మారాలి.. రైతు ఎదగాలి

Select Suryaa Now
సాగు మారాలి.. రైతు ఎదగాలి

 

పొలంలో కొత్త పద్ధతులే.. రైతుకు అదనపు బలం

సాగు మారాలి.. రైతు ఎదగాలి

* సాంకేతికతను అందిపుచ్చుకుంటే సాగులో మెరుగైన ఫలితాలు

* ఒకే పంటపై ఆధారపడొద్దు.. మిశ్రమ, బహుళ పంటలపై దృష్టి

* డ్రిప్‌, మట్టి పరీక్షలు, యంత్రాలు, నాణ్యమైన విత్తనాలకు ప్రాధాన్యం

* పంట బీమా నుంచి మార్కెటింగ్‌ వరకు రైతుకు అవగాహన అవసరం

* అడ్డతీగల కిషాన్‌ మేళాలో ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి

అడ్డతీగల సూర్య ప్రతినిధి 

వ్యవసాయంలో కాలం మారుతోంది.. సాగు పద్ధతులూ మారాల్సిందే. నీటి వినియోగం నుంచి విత్తనాల ఎంపిక వరకు, మట్టి పరీక్షల నుంచి మార్కెటింగ్‌ వరకు రైతు సాంకేతికతను అందిపుచ్చుకుంటేనే ఆదాయం పెంచుకునే అవకాశముందని రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్‌, ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి అన్నారు. అడ్డతీగలలో మంగళవారం నిర్వహించిన కిషాన్‌ మేళా–2026లో రైతులకు అందుబాటులో ఉన్న పథకాలు, ఆధునిక సాగు పద్ధతులు, అనుబంధ రంగాలపై అవగాహన కల్పించారు.

తక్కువ నీటితో.. మెరుగైన సాగు

అడ్డతీగలలోని శ్రీ సాయి సన్నిధి కల్యాణ మండపంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎస్‌.జె.వి. రామ్మోహనరావు అధ్యక్షతన కిషాన్‌ మేళా జరిగింది. రైతే దేశానికి వెన్నెముకని, రైతు అభివృద్ధిని సమాజ అభివృద్ధిగానే చూడాలని శిరీషాదేవి పేర్కొన్నారు. డ్రిప్‌ ఇరిగేషన్‌, ఆధునిక వ్యవసాయ యంత్రాలు, మట్టి పరీక్షలు, నాణ్యమైన విత్తనాలు, శాస్త్రీయ ఎరువుల వినియోగంపై రైతులు దృష్టి పెట్టాలని సూచించారు. వర్షపు నీటిని సంరక్షించడంతో పాటు సూక్ష్మ నీటిపారుదల పద్ధతులతో తక్కువ నీటితో మెరుగైన దిగుబడులు సాధించే అవకాశాలున్నాయని వివరించారు.

అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్‌ పథకాల ద్వారా వేలాది మంది రైతులకు సుమారు రూ.28 కోట్లు అందుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం అందించే రాయితీలు రైతులకు చేరాలంటే అవసరమైన నమోదు ప్రక్రియపై అధికారులు గ్రామస్థాయిలోనే అవగాహన కల్పించాలని సూచించారు.

ఒకే పంట వద్దు.. ఆదాయ మార్గాలు పెరగాలి

ఒకే పంటపై ఆధారపడకుండా చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, ఉద్యాన, వాణిజ్య పంటల వైపు రైతులు దృష్టి సారించాలని సూచించారు. పంట పండించడంతోనే రైతు పని పూర్తికాదని, మార్కెట్‌లో సరైన ధర పొందడమూ ముఖ్యమేనన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, నిల్వ సదుపాయాలు, మార్కెటింగ్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ అవకాశాలను ఉపయోగించుకోవాలని చెప్పారు.

వ్యవసాయంతో పాటు పశుపోషణ, ఉద్యానవనం, మత్స్య సంపద, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ వంటి అనుబంధ రంగాలను ఆదాయ వనరులుగా మార్చుకోవాలని సూచించారు. సేంద్రియ వ్యవసాయానికి మార్కెట్‌లో అవకాశాలు పెరుగుతున్నాయని, యువత దీనిని ఉపాధి మార్గంగా కూడా పరిశీలించాలని పేర్కొన్నారు.

నష్టం రాకముందే.. బీమాపై అవగాహన

వర్షాభావం, వరదలు, తెగుళ్లు, ఇతర ప్రకృతి వైపరీత్యాలతో పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉన్నందున రైతులు పంట బీమాపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. వ్యవసాయ శాఖ సేవలు, ప్రభుత్వ సహాయం, రాయితీలను సకాలంలో వినియోగించుకోవాలన్నారు. గ్రామస్థాయిలో సమస్య పరిష్కారం కాకపోతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, అక్కడా పరిష్కారం కాకపోతే తన దృష్టికి తీసుకురావాలని రైతులకు తెలిపారు.

పొలం దగ్గరకు పరిశోధన ఫలితాలు

కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలు రైతులకు చేరాలని, మన్యం ప్రాంతంలోని భౌగోళిక, వాతావరణ పరిస్థితులకు అనువైన పంటలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు. శాస్త్రవేత్తలు రైతుల సందేహాలకు సమాధానాలు ఇచ్చి, ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పంటల సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.

వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, ప్రకృతి వ్యవసాయం, సూక్ష్మ నీటిపారుదల శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను ఎమ్మెల్యే పరిశీలించారు. వివిధ పంటలు, సాగు పద్ధతుల్లో ప్రతిభ చూపిన రైతులను సన్మానించి జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు.

కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ లోతా లక్ష్మణరావు, మండల పార్టీ అధ్యక్షుడు జర్తా వెంకట రమణారెడ్డి, పల్లాల వెంకటరెడ్డి, కనిగిరి రాంబాబు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి స్వప్నకుమారి, పీఏసీఎస్‌ అధ్యక్షుడు బి.హరిబాబు, వ్యవసాయ శాఖ ఏడీఏ సావిత్రి, ప్రకృతి వ్యవసాయ జిల్లా అధికారి రాబిన్‌ సుదర్శన్‌, ఆత్మ పీడీ కంభం రాబర్ట్‌పాల్‌, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు, వ్యవసాయ–ఉద్యాన–పశుసంవర్ధక శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు హాజరయ్యారు.