BREAKING
జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుపై లారీలు.. వాహనదారులకు తప్పని ఇబ్బందులు! భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనగా నిర్వహించిన గ్రామ సర్పంచ్ విద్యార్థుల్లో రాజ్యాంగ స్ఫూర్తిని పెంపొందించాలి.. డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాలలో ఘనంగా మైక్రోబయాలజీ విభాగం రజతోత్సవాలు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు హౌస్ అరెస్ట్ విక్రమ సింహపురి వర్సిటీలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం రాజ్యాంగ నిర్మాతకు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఘన నివాళి.. విద్యార్థిని అభినందించిన అధ్యాపకులు సైన్స్ ఫెయిర్ వేదికగా రాజకీయ రగడ! హరీశ్ రావు విమర్శలు.. దరిపల్లి చంద్రం కౌంటర్.. అధికారుల మౌనం! ఓటు హక్కు వినియోగించున్న ధర్మాన కుటుంబం పొలిటికల్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం నేడు ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ జ్ఞానజ్యోతి పాఠశాలలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు.. బాధ్యతగా ఎన్నికల విధులు నిర్వహించాలి. రాజ్యాంగ స్ఫూర్తిని మరిచారు...!

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి.

Select Suryaa Now
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి.

 

నిలిచి ఉన్న లారీని ఢీకొన్న స్కూటీ - పెళ్లి నుంచి తిరిగి వస్తుండగా ఘోరం.

పలాస, నవంబర్ 26,మేజర్ న్యూస్.

పలాస - కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని మొగిలిపాడు జంక్షన్ సమీపంలో గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.టెక్కలి మండలం గూడెం గ్రామానికి చెందిన పోకల సుశీల రాణి (33) మందస మండలం తేలగ గంగువాడ గ్రామంలో జరిగిన వివాహ వేడుకకు హాజరయ్యారు.భోజనం ముగించుకుని ఎపి40 ఎంబి 4527 నంబరు గల తన స్కూటీపై మందస నుండి టెక్కలి వైపు వెళ్తుండగా, మధ్యాహ్నం సుమారు 3.00 గంటల సమయంలో జాతీయ రహదారి మొగిలిపాడు జంక్షన్ సమీపంలో రోడ్డు ప్రక్కన నిలిపి ఉంచిన లారీని ఢీ కొంది.ఈ ప్రమాదంలో ఆమె రోడ్డుపై పడిపోవడంతో తీవ్ర రక్తగాయాలై అక్కడికక్కడే మృతి చెందారు.ఈ ఘటనపై మృతురాలి తల్లి లైసెట్టి పార్వతి  పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.