BREAKING
కూటమి అభ్యర్థుల విజయానికి సమన్వయంతో పనిచేస్తాం. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ లలిత కళాపరిషత్ లో డిప్యూటీ మేయర్ టి. స్వాతికి ఘనసత్కారం.. సమాచార హక్కు చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి : రాయపూడి ని పరామర్శించిన మండలి వెంకట్రామ్ అనంతలో సండేస్ ఆన్ సైకిల్ 100వ ఎడిషన్.. భారీగా పాల్గొన్న విద్యార్థులు క్రీడాకారులు భక్తులకు వాటర్ బాటిళ్ల పంపిణీ.. కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలి మనవరాలి పట్టుబట్టడంతో థియేటర్లో రామాయణం చూసిన అమిత్ షా.. సినిమాపై ప్రశంసల వర్షం రెండో విడతలోనూ టీడీపీ హవా! పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం సద్వినియోగం చేసుకోవాలి దేవునిపల్లి రథోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ విజయరమణ రావు రెండో విడతలోనూ కొనసాగిన తొలివిడత ఒరవడి.. ఘనంగా సూఫీ అభిషిక్తులు.. పుస్తక పఠనం విజ్ఞానానికి ఎంతో మేలు యూనివర్సిటీ వేదికపై అసభ్య ప్రవర్తన.. ప్రముఖ యూట్యూబర్ భువన్ బామ్‌పై కేసు నమోదు

రెండోవిడత పల్లెపోరుకు రెడీ!

Select Suryaa Now
రెండోవిడత పల్లెపోరుకు రెడీ!

విజయనగరం బ్యూరో, మేజర్ న్యూస్: జిల్లాలో రెండో దశ పంచాయతీ సమరానికి సర్వం సిద్ధమయ్యింది. బొబ్బిలి, విజయనగరం, చీపురుపల్లి రెవెన్యూ డివిజన్లలోని 10 మండలాల్లో (గజపతినగరం, రాజాం నియోజకవర్గాలతో బాటు జామి, మెంటాడ మండలాలు) మొత్తం 308 పంచాయతీల్లో రెండో దశలో ఆదివారం ఎన్నిక జరగనుంది. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అథారిటీ ఎస్. రాంసుందర్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా యంత్రాంగం ఏర్పాట్లను పూర్తి చేసింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై, 1 గంట వరకు జరుగుతుంది. మధ్యాహ్నం 2 నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి, ఫలితాలను ప్రకటిస్తారు. అనంతరం ఉపసర్పంచ్ ఎన్నిక జరుగుతుంది.

*ఏకగ్రీవాల తర్వాత బరిలో 246 పంచాయతీలు*

 ఈ విడతలో 308 సర్పంచ్ స్థానాలకు నోటిఫికేషన్ వచ్చింది. వీటిలో 64 చోట్ల అభ్యర్థులు ఎదురులేకుండా ఎన్నికయ్యారు. 62 పంచాయతీల్లో పాలకవర్గం మొత్తం ఏకగ్రీవమైంది. మరో రెండింటిలో సర్పంచ్ పదవులు మాత్రమే ఏకగ్రీవమయ్యాయి. దీంతో 244 సర్పంచ్ స్థానాలకు 565 మంది పోటీ పడుతున్నారు. ఏకగ్రీవాల్లో మెంటాడ (11 సర్పంచ్ స్థానాలు), గంట్యాడ (10), గజపతినగరం (9) ముందున్నాయి. జామిలో ఒక్కటీ లేదు. మొత్తం 2,854 వార్డులకు గాను 858 (30.1 శాతం) ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 1,996 వార్డులకు 4,229 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అత్యధికంగా గజపతినగరం (134), గంట్యాడ (117), మెంటాడ (111) మండలాల్లో వార్డు సభ్యులు ఏకగ్రీవమయ్యారు. పోటీ పడుతున్న అభ్యర్థుల సంఖ్యలో రేగిడి ఆమదాలవలస (597) అగ్రస్థానంలో ఉంది.

*3.69 లక్షల ఓటర్లు, 2,275 కేంద్రాలు*

  ఏకగ్రీవాల వల్ల పోలింగ్ కేంద్రాలు 2,854 నుంచి 2,275కి తగ్గింది. పోలింగ్ జరిగే చోట్ల 3,69,251 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 1,83,275 మంది కాగా, మహిళలు 1,85,962 మంది. ఇతరులు 14 మంది. మొత్తమ్మీద పురుషులకన్నా మహిళా ఓటర్లు 2,687 మంది అధికం. రేగిడి ఆమదాలవలసలో ఓటర్లు ఎక్కువ (48,837), వంగరలో తక్కువ (23,518).

*112 సున్నిత, అతి సున్నిత ప్రాంతాలు*

జిల్లాలో 67 సున్నిత, 45 అతి సున్నిత ప్రాంతాలను అధికారులు గుర్తించారు. రేగిడి ఆమదాలవసలో 20 ఉండగా, గంట్యాడలో 13, బొండపల్లి, రాజాం, గజపతినగరం, వంగరల్లో చెరో 12 ఉన్నాయి. పర్యవేక్షణ కోసం 46 జోన్లు, 98 రూట్లుగా విభజించారు. ఈ ప్రాంతాల్లో నిఘాకు 509 సీసీ కెమెరాలను కేటాయించారు. వెబ్‌కాస్టింగ్ ద్వారా 509 గదుల్లోని పోలింగ్‌ను ప్రత్యక్షంగా గమనిస్తారు.

*తరలి వెళ్ళిన సిబ్బంది*

         పోలింగ్ విధులకు ఈ విడతలో 6,156 మందిని వినియోగిస్తున్నారు. వీరిలో 2,761 మంది ప్రిసైడింగ్ అధికారులు, 3,395 మంది ఇతర పోలింగ్ అధికారులు. రేగిడి ఆమదాలవసకు గరిష్ఠంగా 782 మందిని నియమించారు. వీరికి ఆయా మండల కేంద్రాల్లో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో పోలింగ్ సామగ్రిని శనివారం అందజేశారు. సామాగ్రి తీసుకొని తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు.

రవాణా ఏర్పాట్లు
     రవాణాకు 310 వాహనాలను ఏర్పాటు చేశారు. అందులో 130 బస్సులు, 112 టాటా ఏస్/జీపు/మ్యాక్సీ క్యాబ్‌లు ఉన్నాయి. జోనల్ అధికారుల కోసం 48, ఫ్లయింగ్ స్క్వాడ్, ఎంసీసీ బృందాల కోసం 20 కార్లను కేటాయించారు.