రాయవరపు చెన్నమ్మకు ఘన నివాళులు
పామూరు, మేజర్ న్యూస్ :
కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ సమీప బంధువు రాయవరపు చెన్నమ్మ (80) మృతి చెందారు. శనివారం రాయవరపు చెన్నమ్మ భౌతికాయానికి కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రాయవరపు చెన్నమ్మకు కుమారులు మల్లికార్జునరావు, లక్ష్మణరావు, కుమార్తెలు లక్ష్మీరాజ్యం, కృష్ణవేణి, సరళ, మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. ఆమె మృతికి సంతాపం తెలిపి నివాళులు అర్పించిన వారిలో డాక్టర్ తిరివీధి చెన్న కృష్ణయ్య, తిరివీధి జనార్దన్‌రావు, గోపాల్, తిరివీధి కేశవరావు, హజరత్, తిరివీధి చంద్రశేఖర్, వెంకటస్వామి, నూతంగి శ్రీనివాసులు, రామకృష్ణ, నూతంగి వెంకటనారాయణ, సత్యనారాయణ, తిరివీధి శ్రీనివాసులు, నూతంగి భాగ్యమ్మ, తిరివీధి విజయమ్మ, దారపనేని చెన్నమ్మ, తిరివీధి రేవతి, రాయవరపు వారి కుటుంబ సభ్యులు, నూతంగి వారి కుటుంబ సభ్యులు, తిరివీధి వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు ఉన్నారు. చెన్నమ్మ మృతి పట్ల వారు తీవ్ర సంతాపం వ్యక్తం చేసి ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.