పుట్టల కామేశ్వరి దేవాలయంలో చండీహోమం
ఇంకొల్లు, మేజర్న్యూస్ :
ఇంకొల్లు మండలం వంకాయలపాడు గ్రామంలో శ్రీ పుట్టల కామేశ్వరి అమ్మవారి దేవాలయంలో భక్తులు చండీ హోమాన్ని వైభవంగా నిర్వహించారు. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రధాన పూజారులు అద్దంకి వెంకటేశ్వర్లు, హరిప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన హోమానికి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. అమ్మవారు దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈసందర్బంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. పూజల అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు అద్దంకి నర్సింహారావు, సభ్యులు సీతారామయ్య, సత్యనారాయణ, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
సూర్య రిపోర్టర్, షేక్ జానిబాష, ఇంకొల్లు.