BREAKING
టిడిపి 39 వార్డు కౌన్సిలర్ అభ్యర్థి తాతాశీనాకు బ్రహ్మరథం పడుతున్న ప్రజలు ...ఇంటింటా ప్రచారానికి భారీ స్పందన ఓటీటీలోకి సందీప్ కిషన్ సిగ్మా సినిమా.. అక్టోబర్ 30 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ ప్రచారంలో బొమ్మిరెడ్డి తారక్ నాథ్ రెడ్డికి జననీరాజనాలు - ఆదరిస్తున్న అన్ని వర్గాల ప్రజలు ఓటర్ల స్లిప్పులు పంపిణీ సక్రమంగా జరగాలి జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి.. డీపీఆర్ పంపితే కేంద్రం నుంచి రూ.3,000 కోట్ల నిధులు తెస్తా: ఎంపీ ఈటల రాజేందర్ మోస్ట్ అట్రాక్టివ్ మ్యాన్‌గా హాలీవుడ్ నటుడు నోవా వైల్.. పీపుల్స్ మ్యాగజైన్ అరుదైన గౌరవం డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా ముమ్మర ప్రచారం - అడుగడుగునా ఘన స్వాగతం హుషారు 2 టీజర్ విడుదల.. పవర్‌ఫుల్ రోల్‌లో పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా విస్తృత ప్రచారం బాలుడి మృతి ఘటనపై తారా ఆసుపత్రిలో డీఎంహెచ్‌ఓ కళ్యాణ్ చక్రవర్తి తనిఖీలు. గిద్దలూరు 9వ వార్డులో హోరాహోరీ ప్రచారం.. సైకిల్ వర్సెస్ గ్లాస్! డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 17 మందికి జైలు శిక్ష పట్టణ అభివృద్ధే లక్ష్యంగా ఏబీఎం పాలెంలో కూటమి అభ్యర్థుల విస్తృత ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల అందరూ ఆదరించి విజయం చేకూరిస్తే ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా కృషి చేస్తా - వైసీపీ అభ్యర్థి అల్లారెడ్డి ఇందుమతి రెండు ఎంపీటీసీ స్థానాలు తెదేపా ఏకగ్రీవం.

ప్రజల అధికారులు అప్రమత్తంగా ఉండాలి

Select Suryaa Now
ప్రజల అధికారులు అప్రమత్తంగా ఉండాలి

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం బంగాళాఖాతంలో ఏర్పడిన ఆర్నాబ్ తుఫాన్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఆలమూరు మండలంలోని ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీవో ఏ. రాజు సూచించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తుఫాన్ కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులకు పిలుపునిచ్చారు.

మండలంలోని అన్ని గ్రామాల్లో తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను గుర్తించి, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

అలాగే, ప్రతి గ్రామంలో తాటాకు ఇళ్లలో నివసిస్తున్న కుటుంబాలను ముందుగానే గుర్తించి, ఆయా ఇళ్లను ఖాళీ చేయించి సమీపంలోని పాఠశాల భవనాలు, ఇతర ప్రభుత్వ భవనాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు.

తుఫాన్ ప్రభావం తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పర్యవేక్షిస్తూ అవసరమైన సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని ఎంపీడీవో ఏ. రాజు పిలుపునిచ్చారు.