BREAKING
బాధిత రైతు కుటుంబాలకు భరోసాగా కేటీఆర్ పర్యటన - ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అనంతపురం 9వ డివిజన్‌లో ముమ్మరంగా ‘ఇంటింటా ప్రచారం’: కూటమి కార్పొరేటర్ అభ్యర్థి కుంచపు నాగరత్నమ్మకు బ్రహ్మరథం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను కలిసిన రెడ్డి సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఉత్తర నియోజకవర్గం 54వార్డులో జీవీఎంసీ ఎన్నికల ప్రచారం అంతర్జాతీయ సముద్ర రవాణాకు భారీ గండం జి.ఆర్.పి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సర్టిఫికెట్ కోర్సు ముగింపు కార్యక్రమం ఎల్కపల్లి రైతు వేదికలో మోదీ వీడియో కాన్ఫరెన్స్ రైలు కిందపడి యువకుడు మృతి 49 వ వార్డును ఉత్తమ వార్డుగా చేస్తాను.. వైసీపీ అభ్యర్థి బొడ్డేటి మాధవి కిరణ్ గ్రామాల అభివృద్ధి కొనసాగాలంటే సైకిల్ కి ఓటేయాలి. 69వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా బీద మస్తాన్ రావు భారీ ర్యాలీ దక్షిణంలో వైసిపి మేయర్ అభ్యర్థి వరుదు కళ్యాణి విస్తృతంగా ప్రచారం ఏదులాపురం అభివృద్ధికి మరో రూ.100 కోట్లు ఉచిత కంటి శిబిరంలో 55 మందికి కంటి పరీక్షలు....* *20 మందికి కంటి ఆపరేషన్లు....* జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ భరత్ కుమార్ రెడ్డి... అంతర్జాతీయ సదస్సుకు అపోలో వైద్యుడికి ఆహ్వానం

ప్రచారంలో మేకల మధు పావని దూకుడు.. భారీ మెజార్టీ లక్ష్యంగా ముందుకు!

Select Suryaa Now
ప్రచారంలో మేకల మధు పావని దూకుడు.. భారీ మెజార్టీ లక్ష్యంగా ముందుకు!

నెల్లూరు రూరల్, మేజర్ న్యూస్ :  నెల్లూరు రూరల్ పరిధిలోని మూడో డివిజన్‌లో తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి మేకల మధు పావని విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. డివిజన్‌లోని ప్రతి ప్రాంతంలో ఇంటింటికీ వెళ్లి స్థానిక ఓటర్లను కలుస్తూ తనకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.  టీడీపీ నేత మేకల అనిల్ మొదటి నుంచి పార్టీని నమ్ముకుని పనిచేస్తూ స్థానికంగా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆశీస్సులతో మేకల మధు పావనికి కార్పొరేటర్ అభ్యర్థిగా అవకాశం లభించింది.  ఈ నేపథ్యంలో డివిజన్‌లో భారీ మెజార్టీ సాధించడమే లక్ష్యంగా మేకల మధు పావని, మేకల అనిల్ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. స్థానికులను నేరుగా కలుస్తూ వారి మద్దతు కోరుతున్నారు.