కొత్త ఉప్పులూరులో వైభవంగా పోలేరమ్మ తల్లి పొంగళ్లు
కొత్త ఉప్పులూరులో వైభవంగా పోలేరమ్మ తల్లి పొంగళ్లు
సూర్య ప్రతినిధి,
నెల్లూరు జిల్లా కొండాపురం మండలం కొత్త ఉప్పులూరు గ్రామంలో కొలువై ఉన్న పోలేరమ్మ తల్లి పొంగళ్ల కార్యక్రమాన్ని ఆదివారం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన భక్తులు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి సన్నిధిలో పొంగళ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి. గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు