BREAKING
ఇర్లపాడు సెగ్మెంట్లో వైసీపీ ముమ్మర ప్రచారం శివశంకర్ కాలనీలో వైసిపి గర్భ గర్వపు ప్రచారం సర్వేపల్లి రిజర్వాయర్‌లో 3.18 లక్షల చేప పిల్లల విడుదల రైతులకు 100% రాయితీపై పొద్దుతిరుగుడు విత్తనాల పంపిణీ ఏపీలో మున్సిపల్ ఎన్నికలు.. 3 రోజులు మద్యం షాపులు బంద్! స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థులను గెలిపించండి: జిల్లా కార్యదర్శి అరిగెల సాయి పిలుపు ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీ.. చైనాపై ఘన విజయం సాధించిన భారత జట్టు! కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై దేశవ్యాప్త ఆందోళనలు: సీపీఐ రాష్ట్ర నేత జంగాల అజయ్ కుమార్ పొన్నూరులో వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహావిష్కరణలో పాల్గొన్న......... ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ ఎన్నికల విధుల పర్యవేక్షణలో లోపాలు సహించేది లేదు : జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి కూటమితోనే సంక్షేమాభివృద్ధి 40వ వార్డులో కార్పొరేటర్ గుణశేఖర్ సుడిగాలి పర్యటన - చివరి రోజు గ్రూలింగ్స్ పేట - ఎంజీఆర్ వీధిలో విస్తృత ప్రచారం - మేయర్ గా హేమలతకు మద్దతు కూటమి అభ్యర్థుల గెలుపుతోనే అభివృద్ధి సాధ్యం గ్రామాల్లోని ప్రజలకు హోమియోవైద్యముపై అవగాహన కల్పిస్తున్న హోమియోవైద్యులు కరుణాకర్ హైలో ఓపెన్ టోర్నమెంట్‌లో పీవీ సింధు జోరు.. క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లిన భారత స్టార్ షట్లర్!

పొలమూరులో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార జోరు- జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించండి – సత్తి రామారెడ్డి.

Select Suryaa Now
పొలమూరులో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార జోరు-  జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించండి – సత్తి రామారెడ్డి.

 అనపర్తి, మేజర్ న్యూస్:స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అనపర్తి మండలం పొలమూరు గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా ప్రచార బాట పట్టారు. గ్రామంలోని పలు వీధుల్లో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకుంటూ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పొలమూరు గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు సత్తి రామారెడ్డి, సత్తి సూరారెడ్డి, సత్తి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. అనపర్తి మండల జడ్పీటీసీ అభ్యర్థి కొండేటి భీమేష్‌తో పాటు పొలమూరు ఎంపీటీసీ-1 అభ్యర్థిని గుడాల ధనలక్ష్మి, ఎంపీటీసీ-2 అభ్యర్థి గుడాల మాచరావులకు మద్దతుగా నాయకులు, కార్యకర్తలు గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేస్తూ పార్టీ విధానాలు, గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించిన అంశాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా మాజీ ప్రతిపక్ష నాయకుడు, రైతు బాంధవుడుగా పేరున్న నాయకులు, పొలమూరు వైఎస్సార్‌సీపీ నేత సత్తి రామారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని పేర్కొన్నారు. గ్రామంలో నిర్వహిస్తున్న ఇంటింటి ప్రచారానికి ప్రజల నుంచి స్పందన లభిస్తోందన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ఎన్నికల ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించి కీలకమని పేర్కొంటూ, ప్రజలు తమ అభ్యర్థులకు మద్దతు తెలపాలని కోరారు. ఈ ఎన్నికలు భవిష్యత్తు రాజకీయ పరిణామాలకు కూడా ప్రాధాన్యత కలిగినవని, 2029 సార్వత్రిక ఎన్నికలకు రాజకీయంగా ఒక దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ నేపథ్యంలో ఓటర్లు తమ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి జడ్పీటీసీ అభ్యర్థి కొండేటి భీమేష్‌తో పాటు ఎంపీటీసీ అభ్యర్థులు గుడాల ధనలక్ష్మి, గుడాల మాచరావులను అఖండ మెజారిటీతో గెలిపించాలని సత్తి రామారెడ్డి విజ్ఞప్తి చేశారు.ఈ ప్రచార కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ గ్రామ నాయకులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇంటింటి ప్రచారం, ఓటర్లతో ప్రత్యక్ష సమావేశాలతో పొలమూరు గ్రామంలో ఎన్నికల సందడి నెలకొంది.