పంచాయితీ ఎన్నికలలో అర్హులైన సిబ్బందికి ఎన్నికల మినహాయింపులు ఇవ్వాలి
బలిజిపేట, సూర్య : రానున్న పంచాయితీ ఎన్నికలలో అర్హులైన పోలింగ్ సిబ్బందికి ఎన్నికల మినహాయింపులు ఇవ్వాలని, పోలింగ్ సిబ్బందికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (1938) పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షులు మజ్జి శేషగిరి రావు డిమాండ్ చేశారు. బలిజిపేట మండల మోడల్ ప్రైమరీ పాఠశాలలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చిన్న పిల్లల తల్లులు, గర్భిణీ స్త్రీలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి, తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారికి, అంధులకు, దివ్యాంగులకు, 58 సంవత్సరాలు పైబడిన వారికి ఎన్నికల విధుల నుండి మినహాయింపు ఇవ్వాలని అలాగే పంచాయితీ ఎన్నికలలో విధులు నిర్వహించే సిబ్బందికి అన్ని పోలింగ్ కేంద్రాలలో మంచి భోజనం, మంచినీరు, వసతి సౌకర్యాలు కల్పించాలని, మహిళా ఉపాధ్యాయులకు సొంత మండలంలోనే విధులు కేటాయించాలని, మిగిలిన వారికి సమీప మండలాల్లోనే విధులు వేయాలని కోరారు.ఇటీవల జరిగిన మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో సిబ్బంది పడిన ఇబ్బందులు పంచాయితీ ఎన్నికలలో పునరావృతం కాకుండా చూడాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ బాధ్యులు నిమ్మకాయల రాంబాబు, యాండ్రపు శ్రీనివాసరావు, ఆర్నిపల్లి పరిశినాయుడు తదితరులు పాల్గొన్నారు.