BREAKING
కూటమి అభ్యర్థుల విజయానికి సమన్వయంతో పనిచేస్తాం. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ లలిత కళాపరిషత్ లో డిప్యూటీ మేయర్ టి. స్వాతికి ఘనసత్కారం.. సమాచార హక్కు చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి : రాయపూడి ని పరామర్శించిన మండలి వెంకట్రామ్ అనంతలో సండేస్ ఆన్ సైకిల్ 100వ ఎడిషన్.. భారీగా పాల్గొన్న విద్యార్థులు క్రీడాకారులు భక్తులకు వాటర్ బాటిళ్ల పంపిణీ.. కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలి మనవరాలి పట్టుబట్టడంతో థియేటర్లో రామాయణం చూసిన అమిత్ షా.. సినిమాపై ప్రశంసల వర్షం రెండో విడతలోనూ టీడీపీ హవా! పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం సద్వినియోగం చేసుకోవాలి దేవునిపల్లి రథోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ విజయరమణ రావు రెండో విడతలోనూ కొనసాగిన తొలివిడత ఒరవడి.. ఘనంగా సూఫీ అభిషిక్తులు.. పుస్తక పఠనం విజ్ఞానానికి ఎంతో మేలు యూనివర్సిటీ వేదికపై అసభ్య ప్రవర్తన.. ప్రముఖ యూట్యూబర్ భువన్ బామ్‌పై కేసు నమోదు

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీసుల ముందస్తు హెచ్చరికలు.

Select Suryaa Now
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీసుల ముందస్తు హెచ్చరికలు.

 

లాడ్జి యజమానులు, ప్రజలు పోలీసులకు సహకరించాలి,
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు.


పాతపట్నం మేజర్ న్యూస్: నవంబర్ 28:

గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ ముందస్తు భద్రతా చర్యలు చేపట్టింది. నవంబర్ 29న పాతపట్నం, మెళియాపుట్టి మండలాల పరిధిలో జరగనున్న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నేపథ్యంలో ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు, లాడ్జి యజమానులు పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరించాలని పాతపట్నం సర్కిల్ పోలీసు శాఖ విజ్ఞప్తి చేసింది. ఎన్నికల సమయంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే అనుమానాస్పద వ్యక్తులు, గొడవలకు పాల్పడే వ్యక్తుల కదలికలను ముందుగానే గుర్తించేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలగకుండా, ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.

లాడ్జి యజమానులకు ప్రత్యేక సూచనలు.

పాతపట్నం, మెళియాపుట్టి మండలాల్లోని అన్ని లాడ్జిలు, గెస్ట్ హౌస్లు, ప్రైవేట్ వసతి గృహాల యజమానులు తమ వద్ద బస చేసే వ్యక్తుల వివరాలను తప్పనిసరిగా రిజిస్టర్లో నమోదు చేయాలని పోలీసులు ఆదేశించారు. ఇతర మండలాలు, జిల్లాలు, రాష్ట్రాల నుంచి నవంబర్ 28, 29 తేదీల్లో వచ్చి బస చేసే వ్యక్తుల పూర్తి వివరాలు, గుర్తింపు కార్డు ప్రతులు, చిరునామా, ఫోన్ నంబర్, వచ్చిన ఉద్దేశాన్ని నమోదు చేయాలి. అనుమానాస్పద వ్యక్తులు లేదా బృందాలకు ఎలాంటి సమాచారం లేకుండా వసతి కల్పించరాదని స్పష్టం చేశారు. అలాగే బస చేసే వ్యక్తుల గుర్తింపు వివరాలను పరిశీలించి, అవసరమైన సమాచారాన్ని సంబంధిత పోలీస్ స్టేషను అందించాలని సూచించారు. లాడ్జిల్లో సిసిటీవీ కెమెరాలు సక్రమంగా పనిచేసేలా చూసుకోవాలని, పోలీసుల తనిఖీలకు సహకరించాలని తెలిపారు.

ప్రజలు, రాజకీయ పార్టీలకు సూచనలు.

ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభపెట్టడం, బెదిరించడం, మద్యం లేదా ఇతర వస్తువులను పంపిణీ చేయడం వంటి చర్యలకు పాల్పడరాదని పోలీసులు హెచ్చరించారు. అనుమతి లేకుండా సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించకూడదని సూచించారు. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించేలా రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం, తప్పుడు ప్రచారం చేయడం, సోషల్ మీడియాలో నిరాధార వార్తలు, పుకార్లు వ్యాప్తి చేయడం వంటివి నిషేధమని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులు, అనుమానాస్పద కార్యకలాపాలు, ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు సంబంధించిన సమాచారాన్ని వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. సోషల్ మీడియా ద్వారా వచ్చే తప్పుడు ప్రచారాలు, రెచ్చగొట్టే సందేశాలు, వదంతుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు..
ఎన్నికల ప్రశాంతతకు భంగం కలిగించే వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసు శాఖ హెచ్చరించింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంది. ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసు శాఖకు సహకరించాలని పాతపట్నం సర్కిల్ పోలీసు శాఖ విజ్ఞప్తి చేసింది.