పాములపాడు లో 20 నామినేషన్లు
పాములపాడు, మేజర్ న్యూస్: ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి పాములపాడు మండలంలో మొదటి రోజు మొత్తం 20నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజు తెలిపారు.
మండలంలోని వివిధ గ్రామాల నుంచి టీడీపీ, వైసీపీ పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు ఆయన వెల్లడించారు. వీరిలో టీడీపీ నుంచి ముగ్గురు, వైసీపీ నుంచి 17 మంది అభ్యర్థులు నామినేషన్లు వేసినట్లు తెలిపారు.
ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎస్ఐ తిరుపాలు ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.