BREAKING
పోగొట్టుకున్న పర్సు ను 24 గంటల లోపే బాధితుడికి అప్పగించిన రామకృష్ణాపూర్ పోలీసులు. స్వచ్ఛతలో భాగస్వాములుకండి.. -సర్పంచ్ కవిత నర్సింగ్ విద్యార్థిని ఆత్మ హత్య.. ప్రతి నెల మొదటి రోజే అవ్వాతాతల ఇంటి వద్దకు పింఛన్ విజయలక్ష్మీ గునుకుల-జనసేన జిల్లాలో భూ భారతి రీ-సర్వే ప్రక్రియను పారదర్శకంగా, ఖచ్చితత్వంతో, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించాలి. జిల్లా కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు. జిల్లాస్థాయి వాకృత్వ పోటీల్లో మండపేట విద్యార్థులు ప్రతిభ ఎట్టకేలకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న సుడిగాలి సుధీర్ గోట్ మూవీ గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే ని కలిసిన పాండురంగ రిజర్వాయర్ ముంపు బాధితులు వృద్ధాప్యాన్ని గౌరవిద్దాంపై అవగాహన పేదల జీవితాల్లో ఆనందం నింపుతున్నకూటమి ప్రభుత్వ లక్ష్యం నిజాంపేటలో ఉచిత మెగా వైద్య శిబిరం రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంపై కేబినెట్‌ సుదీర్ఘ చర్చ.. అఖిలపక్ష సమావేశానికి సీఎం రేవంత్ ఆదేశం మానవతా స్ఫూర్తితో రక్తదానం రాష్ట్ర స్థాయి కుంగ్- ఫూ కరాటే లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినీయులు అల్లు రామలింగయ్య జయంతి వేళ.. సరికొత్త క్రియేటివ్ ఆఫీస్ ఐకాన్జా ప్రారంభించిన అల్లు అర్జున్

ముంపుదారి కి అడ్డొస్తే.. తొలగించాల్సిందే!

Select Suryaa Now
ముంపుదారి కి అడ్డొస్తే.. తొలగించాల్సిందే!

ముంపు దారికి అడ్డొస్తే.. తొలగించాల్సిందే!

కాలువలు, డ్రైన్లపై ఆక్రమణలకు చెక్‌

అక్టోబర్‌ అంతా క్షేత్రంలోనే జేసీ అపూర్వ భరత్‌

వరి కోతలకు ముందే నీటి ప్రవాహం సాఫీగా ఉండేలా చర్యలు

పిఠాపురం, గొల్లప్రోలు ముంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి

అన్నవరం, తాళ్లరేవుల్లో అవసరమైతే పోలీసు బందోబస్తు

 

ఉమ్మడి గోదావరి జిల్లాల సూర్య బ్యూరో 

(కాకినాడ)
పంట కాలువలు, డ్రైన్లలో నీటి ప్రవాహానికి అడ్డుగా మారిన ఆక్రమణలపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. నిబంధనల ప్రకారం వాటిని గుర్తించి, చట్టపరమైన ప్రక్రియ పూర్తిచేసి తొలగించాలని జాయింట్‌ కలెక్టర్‌ అపూర్వ భరత్‌ అధికారులను ఆదేశించారు. అక్టోబరు నెలాఖరుకు వరి పంటలు కోతకు రానున్న నేపథ్యంలో ముంపుతో రైతులకు నష్టం వాటిల్లకుండా ఇప్పటి నుంచే కాలువలు, డ్రైన్లలో నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

స్థానిక కలెక్టరేట్‌లో బుధవారం ఏలేరు, గోదావరి ఈస్ట్రన్‌ ఇరిగేషన్‌ డివిజన్లు, జిల్లా డ్రైనేజీ విభాగం ఇంజినీర్లు, పంచాయతీ అధికారులతో వాచ్‌డాగ్‌ పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆక్రమణల పరిస్థితి, ముంపునకు కారణమవుతున్న ప్రాంతాలు, చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు.

రోజు విడిచి రోజు క్షేత్రంలోకి..

అక్టోబరు నెలంతా రోజు విడిచి రోజు మూడు ఇరిగేషన్‌ డివిజన్ల పరిధిలో విస్తృతంగా పర్యటిస్తానని జేసీ తెలిపారు. ముంపు నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న ఆక్రమణలను క్షేత్రస్థాయిలో గుర్తించి తొలగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇంజినీర్లు కూడా నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించాలని సూచించారు.

పిఠాపురం, గొల్లప్రోలుపై ప్రత్యేక దృష్టి

పిఠాపురం, గొల్లప్రోలు ప్రాంతాల్లో ముంపు సమస్యపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. అన్నవరం, తాళ్లరేవుల్లో ఆక్రమణల తొలగింపునకు అవసరమైతే డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసు బలగాలను మోహరించాలని సూచించారు. రెవెన్యూ, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌, ఇరిగేషన్‌, పోలీసు శాఖలు సమన్వయంతో వ్యవహరించి, నిబంధనల మేరకు నోటీసులు జారీ చేసిన తర్వాతే తొలగింపు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

తొలగింపుతోనే సరిపోదు..

ఆక్రమణల తొలగింపుతో పాటు కాలువల్లో పేరుకుపోయిన పూడిక, చెత్తను తొలగించాలని జేసీ ఆదేశించారు. ఒకసారి ఆక్రమణలు తొలగించిన ప్రాంతాల్లో మళ్లీ ఆక్రమణలు జరగకుండా వాచ్‌డాగ్‌ కమిటీ నిరంతరం పర్యవేక్షించాలన్నారు. డ్రైనేజీ సమస్యలపై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని, మండలాలు, మున్సిపాలిటీల వారీగా ఆక్రమణల తొలగింపుపై నివేదికలు సిద్ధం చేయాలని సూచించారు.

సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్‌ డి.తిప్పేనాయక్‌, పెద్దాపురం ఆర్డీఓ జి.కృష్ణమూర్తి, స్థానిక ఆర్డీఓ కార్యాలయ పరిపాలనాధికారి చైనులు, ఏలేరు డివిజన్‌ ఇరిగేషన్‌ ఈఈ జి.శేషగిరిరావు, ఈస్ట్రన్‌ డివిజన్‌ ఈఈ వి.వి.రామకృష్ణ, జిల్లా డ్రైనేజీ డివిజన్‌ ఈఈ ఎన్‌.వి.వి.కిషోర్‌, పంచాయతీ అధికారులు, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.